2023 సంక్రాంతి పండుగ కానుకగా భారీ సంఖ్యలో సినిమాలు విడుదలవుతుండగా ఈ సినిమాలకు థియేటర్లను కేటాయించడం విషయంలో ఎన్నో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో పోల్చి చూస్తే వారసుడు సినిమాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కేటాయించడం విషయంలో ఫ్యాన్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే అవతార్2 సినిమా వల్ల సంక్రాంతి సినిమాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీన అవతార్2 మూవీ థియేటర్లలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
అవతార్2 మూవీ కళ్లు చెదిరే బుకింగ్స్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు మల్టీప్లెక్స్ ఓనర్లకు షరతులు విధించారని సమాచారం అందుతోంది. అవతార్2 మూవీ ఇండియన్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సంక్రాంతి సమయానికి కూడా మేజర్ థియేటర్లలో అవతార్2 సినిమాను ప్రదర్శించే విధంగా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.
ఈ మేరకు షరతులు విధించి డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా హక్కులను అవతార్2 మేకర్స్ ఇచ్చారని సమాచారం. సంక్రాంతి సినిమాలకు మరిన్ని కష్టాలు రానున్నాయని తెలిసి ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు. అవతార్2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వారాల పాటు ప్రదర్శితం కానుందని బోగట్టా. పరిమిత సంఖ్యలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఉండటం వల్ల పండుగకు సినిమాలను రిలీజ్ చేయాలని భావించిన సినిమాల నిర్మాతలకు సమస్యలు ఎదురవుతున్నాయి.
2023 సంక్రాంతి పోటీ మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పరిమిత సంఖ్యలో థియేటర్లలో సినిమా విడుదలైనా హిట్ టాక్ వస్తే మాత్రం సినిమాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కామెంట్లు వినిపిస్తున్నాయి. అవతార్2 సినిమా వల్ల టాలీవుడ్ సినిమాలకు కొత్త సమస్యలు ఎదురవుతూ ఉండటం గమనార్హం.