పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అని చెప్పాలి. డిసెంబర్ 22 న అంటే మరో 2 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కోసం అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్స్ లేవు.. థియేటర్ కి వెళ్లి టికెట్లు తీసుకోవాల్సిందే అని మేకర్స్ ప్రకటించి షాకిచ్చారు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే..
‘సలార్’ టీజర్ కానీ, ట్రైలర్ కానీ ప్రేక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. కానీ రిలీజ్ ట్రైలర్ మాత్రం హోప్స్ ఇచ్చింది. ‘సూరీడే’ అనే పాట ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయ్యింది. ఇవి తప్ప ‘సలార్’ ప్రమోషన్స్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేవు. ఇక ఈ సినిమాలో పాటలు ఎక్కువ ఉండవు అని.. అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఊహించని విధంగా రేపు ఇంకో పాట రాబోతుంది అని టాక్ వినిపిస్తుంది.డిసెంబర్ 20న ‘సలార్’ (Salaar) నుండి ఇంకో పాట రాబోతుంది అని టాక్ తెలుస్తుంది.
దీంతో ఇప్పుడు దీనిపై చర్చ మొదలైంది. ఈ పాట కూడా బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లా ఉంటుందా? లేక హీరోయిన్ శృతి హాసన్ తో హీరో ప్రభాస్ కి రొమాంటిక్ సాంగా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘సలార్’ లో స్పెషల్ సాంగ్ కూడా ఉందని, ‘డర్టీ హరి’ ఫేమ్ సిమ్రత్ కౌర్ తో ఓ స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించారట. అది కూడా అయ్యుండొచ్చు అని సమాచారం.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!