Adipurush: మరో టీజర్ తో ఆదిపురుష్ పై అంచనాలు పెరుగుతాయా?

ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ నుంచి దసరా పండుగ కానుకగా ఒక టీజర్ విడుదలైంది. ఈ టీజర్ త్రీడీలో బాగానే ఉన్నా యూట్యూబ్ లో ఈ టీజర్ ను చూసిన ప్రేక్షకులు మాత్రం నిరాశ చెందారు. ఈ టీజర్ గురించి ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేశారు. దసరా కానుకగా విడుదలైన టీజర్ వల్ల ఆదిపురుష్ మూవీపై అంచనాలు తగ్గాయి. టీజర్ గురించి ఓం రౌత్ వివరణ ఇచ్చినా ఫ్యాన్స్ మాత్రం సంతృప్తి చెందలేదు.

యూట్యూబ్ లో టీజర్ రికార్డులు సృష్టించినా మెజారిటీ ఆడియన్స్ నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు కాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్ కానుంది. మరోవైపు ఆదిపురుష్ గ్రాఫిక్స్ లో కూడా మార్పులు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

తాజాగా ప్రభాస్ త్వరలో మరో బ్లాస్ట్ కు సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇవ్వడంతో ఆదిపురుష్ మూవీ నుంచి మరో టీజర్ విడుదల కానుందని క్లారిటీ వచ్చింది. ఈసారి రిలీజయ్యే టీజర్ తో సినిమాపై అంచనాలు పెరుగుతాయో తగ్గుతాయో చూడాలి. ప్రభాస్ గత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని నేపథ్యంలో ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.

సినీ సెలబ్రిటీలు సైతం ఆదిపురుష్ టీజర్ గురించి విమర్శలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఆదిపురుష్ కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఓం రౌత్ నమ్ముతున్నారు. ఈ సినిమా విషయంలో ఓం రౌత్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. కృతిసనన్ ఈ సినిమాలో సీత పాత్రలో నటించారు. ప్రభాస్, కృతిలకు ఈ సినిమాతో కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags