పవర్ స్టార్ ఇమేజ్, బ్రాండ్ ను వర్మ క్యాష్ చేసుకున్నట్లుగా ఎవరూ చేయలేకపోయారు

పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను ఇప్పటివరకూ చాలామంది వాడుకున్నారు. ఆయనతో సినిమాలు తీసిన డైరెక్టర్లు మొదలుకొని.. ఆయన అభిమానులమంటూ పబ్లిక్ గా చెప్పుకొనే హీరోల వరకూ అందరూ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ను గట్టిగా వాడుకున్న బ్యాచే. అయితే.. వాళ్లందరి వాడకాన్ని మించిపోయింది రాంగోపాల్ వర్మ వాడకం. ఒటీటీ, ఏటీటీ అని వర్మ ఈమధ్య డిజిటల్ రిలీజులు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత జనాలని ఆకట్టుకోవడానికి “క్లైమాక్స్, నగ్నం” వంటి షార్ట్ లెంగ్త్ ఫిలిమ్స్ తీసి ప్రేక్షకుల్ని తనవైపుకు తిప్పుకొన్న వర్మ ఇవాళ “పవర్ స్టార్” అనే ట్రైలర్ ను విడుదల చేశాడు.

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ట్రైలర్ చూపించడానికి కూడా డబ్బు వసూలు చేశాడు. ఏదో బీగ్రేడ్ పేరడీ సినిమా ట్రైలర్ లా ఉంది ఈ పవర్ స్టార్. ఇప్పటికే విడుదలైన ‘క్లయిమాక్స్, నెకెడ్’, త్వరలో రాబోతున్న ‘థ్రిల్లర్’ మూవీస్ తరహాలో ‘పవర్ స్టార్’ బూతు సినిమా కాదు కాబట్టి, దానికి పెద్దంతగా డబ్బులు రావని ఆర్జీవీకి తెలుసు. అందుకే… ట్రైలర్ తోనే అందిన కాడికి సొమ్ము చేసుకునే ప్రయత్నం మొదలెట్టారు. నిజానికి ఇదంతా మామూలు కథ. ఇందులో కొత్త మెలిక ఏమిటంటే… ఇంతవరకూ వర్మ తీసిన సినిమాలను గీతా ఆర్ట్స్ సంస్థతో గాఢానుబంధం ఉన్న శ్రేయాస్ మీడియాకు చెందిన శ్రేయాస్ ఇటీ ఏటీటీ ద్వారా రిలీజ్ చేసింది.

అయితే.. వర్మ ‘పవర్ స్టార్’ అనౌన్స్ చేయగానే… దీనిని శ్రేయాస్ ఇటీలో ఎలా విడుదల చేస్తారు? అదే జరిగితే… శ్రేయాస్ శ్రీనుకు గీతా ఆర్ట్స్ లోని అతని సన్నిహితులకు మధ్య సంబంధాలు చెడతాయి కదా అనే సందేహం అందరికీ వచ్చింది. దీన్ని నివృత్తి చేస్తూ… వర్మ తన ‘పవర్ స్టార్’ మూవీని సొంతంగా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ప్రదర్శించబోతున్నానని చెప్పాడు. సూపర్… వర్మ ఈ రకంగా సొంత కుంపటి పెట్టుకున్నాడు. మంచిదే కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే… ఇప్పుడు వర్మపై సెటైరిక్ గా ‘బిగ్ బాస్’ ఫేమ్ నూతన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పరాన్న జీవి’ సినిమాను వర్మ ‘పవర్ స్టార్’కు పోటీగా అదే రోజున విడుదల చేయబోతున్నారు. అంతేకాదు… ఈ ‘పరాన్నజీవి’ సినిమా ఇప్పుడు శ్రేయాస్ ఇటీలో విడుదలవుతోంది!


40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus