ప్రభాస్ సినిమా క్రేజ్ మాములుగా లేదు!

వరుస పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు ప్రభాస్. మరో రెండు, మూడేళ్లు ప్రభాస్ తన డైరీని సినిమాలతో నింపేశాడు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోన్న ప్రభాస్.. వచ్చే ఏడాది జనవరి నుండి ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాల కోసం పని చేయనున్నారు. ముందుగా అయితే ‘సలార్’ సినిమాను పూర్తి చేయనున్నారు. ఈ సినిమా కోసం కేజీఎఫ్ దర్శకనిర్మాతలు ప్రశాంత్ నీల్. విజయ్ కిరగందూర్ తో కలిసి ప్రభాస్ పని చేయనున్నారు. ఈ సినిమా ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు దర్శకనిర్మాతలు.

అందుకే హైదరాబాద్ లో ఆడిషన్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో ఉన్నఅల్యూమినియం ఫ్యాక్టరీలో ఈనెల 15న ఆడిషన్స్ ని నిర్వహించారు. దీనికోసం మంగళవారం తెల్లవారుజాము నుండే జనాలు క్యూలు కట్టారు. ఈ ఆడియన్స్ కోసం చిత్ర నిర్మాణ సంస్థ భారీగా ఏర్పాట్లు చేసింది. ఒకేసారి ఎక్కువ మందిని పరీక్షించడానికి మల్టిఫుల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నవారు ఒక్క నిమిషం పాటుఏదైనా భాష‌లో కెమెరా ముందు నటించాల్సి ఉంటుంది.

ప్రభాస్ సినిమాలో నటించాలనే కోరికతో చాలా మంది ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నారు. యువ‌కులతోపాటు వివిధ ఏజ్ గ్రూప్ ల వాళ్లు కూడా రావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కరోనా కాలంలో కూడా ఆడిషన్స్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇంతమంది జనాలు ఒకచోటుకి చేరుకున్నా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంది. హైద‌రాబాద్ తోపాటు బెంగ‌ళూరు, చెన్నైలో కూడా ఈ సినిమా ఆడిష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus