Operation Valentine First Review: ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

వరుణ్ తేజ్ హీరోగా మాజీ మిస్ వరల్డ్ కమ్ బాలీవుడ్ బ్యూటీ అయిన మానుషి చిల్లర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు-హిందీ..లో ద్విభాషా చిత్రంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపొందింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్’, ‘సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్’ వారు నిర్మించగా, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరించారు.

రుహాని శర్మ కూడా ఈ సినిమాలో (Operation Valentine) కీలక పాత్ర పోషించింది. మార్చి 1న అంటే మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను బాగానే ఇంప్రెస్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలు వీక్షించడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం ఫస్ట్ హాఫ్ బాగానే ఉందట. మొదట్లో కొంచెం స్లోగా సాగినప్పటికీ.. తర్వాత అందరినీ ఎంగేజ్ చేసే విధంగా ఉంటుందని అంటున్నారు.

ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలెట్ గా ఉంటుందట. సంభాషణలు కూడా బాగానే ఉన్నాయని, వరుణ్ తేజ్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ అందరినీ అలరిస్తుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా బాగా ఎంగేజ్ చేస్తుందట. ఎమోషనల్ కనెక్ట్ మరీ చిత్ర బృందం చెప్పిన రేంజ్లో లేకపోయినా.. ఎంగేజ్ చేస్తుందని అంటున్నారు. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ గా ఉంటుందని అంతా కామెంట్లు చేస్తున్నారు.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus