Ori Devuda OTT: ఓరిదేవుడా ఆ ఓటీటీలో రిలీజయ్యే ఛాన్స్ ఉందా?

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా మూవీ నిన్న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో చాలామంది ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూడగా ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమా వీకెండ్ కలెక్షన్లను బట్టి ఈ సినిమా రిజల్ట్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడీగా ఆశాభట్, మిథిలా పాల్కర్ నటించారు. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. విశ్వక్ సేన్ గతంలో నటించిన కొన్ని సినిమాలు ఆహా ఓటీటీలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఆహా ఓటీటీ క్రేజ్ ఉన్న సినిమాల హక్కులను కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

విశ్వక్ సేన్ ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతుండటంతో ఆయన సినిమాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. విశ్వక్ సేన్ భవిష్యత్తు సినిమాలు కూడా సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. విశ్వక్ సేన్ తను హీరోగా తెరకెక్కుతున్న పలు సినిమాలను సొంతంగా నిర్మిస్తుండగా ఇతర సినిమాలకు 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

విశ్వక్ సేన్ గతంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. విశ్వక్ సేన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. విశ్వక్ సేన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus