నాగచైతన్య “తండేల్” సినిమా రిలీజ్ టైమ్ లో, అదే కథతో ఒక వెబ్ సిరీస్ వస్తోందని, సినిమా కంటే ముందు అది రిలీజ్ అయితే, సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి.. చాలా రిక్వెస్ట్ చేసి, కొన్ని డబ్బులు కూడా ఇచ్చి మరీ ఆ వెబ్ సిరీస్ రిలీజ్ ను అల్లు అరవింద్ నేతృత్వంలో పోస్ట్ పోన్ చేయించారనే టాక్ నడిచింది. “తండేల్” రైటర్ కార్తీక్ కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశారు.
నిజానికి “తండేల్” కథకు ఓనర్స్ అంటూ ఎవరు లేరు. అరేబియా సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్ ఆర్మీ చేతుల్లో చిక్కుకున్న కొందరు జాలర్ల కథ ఇది. న్యూస్ పేపర్స్ లో వచ్చింది, నేషనల్ టాపిక్ కూడా అయ్యింది. అందువల్ల ఎవరికీ స్పెసిఫిక్ గా రైట్స్ లేవు.
అందుకే క్రిష్ & టీమ్ ఆ అంశాన్ని తీసుకొని ఓ వెబ్ సిరీస్ ను రూపొందించారు. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ను క్రిష్ నిర్మించారు.
ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కి సిద్ధమైంది. సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సిరీస్ కు “అరబిక్ కదలి” అనే టైటిల్ ను ఫిక్స్ చేసి, ఆగస్ట్ 8 నుంచి అమెజాన్ లో స్ట్రీమ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సిరీస్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా.. ఆల్రెడీ తెలిసిన కథ కావడంతో ఎంతవరకు ఆసక్తికరంగా ఉంటుంది అనేది ప్రశ్నార్ధకం.
ఇకపోతే.. సత్యదేవ్ ఆల్రెడీ జూలై 31న “కింగ్డమ్”లో శివగా ప్రేక్షకుల్ని పలకరించనుండగా.. ఇప్పుడు “అరబిక్ కదలి”తో ఆగస్ట్ 8న మరోసారి ఇంటర్నెట్ ఆడియన్స్ కు కనువిందు చేయనున్నాడు. ఇలా ప్రతివారం ఒక నటుడు ప్రేక్షకుల ముందుకు కొత్త కథతో వచ్చే అవకాశం అనేది చాలా అరుదుగా వస్తుంది.