War 2: ‘వార్‌ 2’ని లేపుతున్న ఆర్మాక్స్‌.. రికార్డు స్థాయి వీక్షణలంటూ…

థియేటర్లలో తేడా కొట్టే సినిమా.. ఓటీటీలో విజయం సాధించింది అంటే నమ్మడం కష్టమే. ఎందుకంటే మౌత్‌ టాక్‌తో థియేటర్లకు జనాలను రప్పించొచ్చు. దీని కోసం కొంతమంది నిర్మాతలు భారీ వసూళ్ల పోస్టర్లు వేస్తుంటే.. మరికొందరు సోషల్‌ మీడియా మీద ఆధారపడుతున్నారు. అయితే ఈ స్ట్రాటజీలు ఓటీటీకి వచ్చినప్పుడు పని చేయడం లేదు. దీంతో తమ సినిమాకు ఓటీటీలో భారీ వ్యూస్‌ వస్తున్నాయనే ప్రచారం ఒకటి స్టార్ట్‌ చేశారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ‘వార్‌ 2’ సినిమాకు అలాంటి భారీ వ్యూస్‌ వస్తున్నాయని అనౌన్స్‌ చేశారు.

War 2

యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘వార్‌ 2’ సినిమా ఆగస్టులో విడుదలైన విషయం తెలిసిందే. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో సరైన స్పందన రాలేదు. దీంతో వెంటనే ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ వెల్లడించిన ఓ రిపోర్టులో అత్యధిక వీక్షణలు పొందిన సినిమాల జాబితాలో ‘వార్‌ 2’ టాప్‌లో ఉంది. అక్టోబర్‌ 6 నుండి అక్టోబర్‌ 12 వరకు వచ్చిన వీక్షణల ఆధారంగా ఈ లిస్ట్‌ రెడీ చేసినట్లు తెలిపింది. ‘వార్‌ 2’ సినిమాకు అత్యధికంగా 3.5 మిలియన్ల వ్యూస్‌ వచ్చినట్లు ఆర్మాక్స్‌ ప్రకటించింది. దీంతో గత వారం ఇండియాలోనే ఎక్కువమంది చూసిన సినిమాగా ‘వార్‌ 2’ నిలిచిందట.

పైన చెప్పినట్లు థియేటర్లలో చూడని సినిమాను, ఓటీటీలో అంతమంది చూస్తున్నారా? అని. దీనికి సమాధానంగా చూసే అవకాశం ఉంది అని అనొచ్చు. ఎందుకంటే ఈ సినిమాను థియేటర్లలోకి వెళ్లి చూడక్కర్లేదు. ఓటీటీలో చూసుకుందాం అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అలాంటివారికి ఇలాంటి ఆర్మాక్స్‌ నివేదికలు బూస్ట్‌ ఇస్తాయని చెప్పాలి. ఎందుకంటే ఇవి మౌత్‌ టాక్‌ లాంటివే మరి. చూద్దాం ‘వార్‌ 2’ సినిమా ఓటీటీ వ్యూస్‌ అభిమానులకు ఏమన్నా ఆనందాన్నిస్తాయేమో చూడాలి.

‘మడాక్‌’ విశ్వంలోకి మత్తు కళ్ల సుందరి.. ఎలా కనిపిస్తుందో మరి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus