చలన చిత్ర పురస్కారాల్లో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ పురస్కాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. లాస్ ఏంజిలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ 94వ అకాడమీ (అస్కార్) అవార్డ్స్ వేడుకలో ఉత్తమ పురస్కరాలను ప్రకటించింది, అందించారు. కరోనా పరిస్థితుల కారణంగా గత రెండేళ్లు సందడి లేకుండా నిర్వహించిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్వానికి ఈ ఏడాది పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఇక పురస్కారాల సంగతికొస్తే… వివిధ విభాగాల్లో ‘డ్యూన్’ హవా చూపించింది.
ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో ‘డ్యూన్’ బృందం ఆస్కార్ పురస్కారాలు దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ‘కోడా’ ఎంపికవ్వగా, విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా నిలిచాడు. జెస్సికా చాస్టెయిన్ ఉత్తమ నటి పుస్కారం దక్కించుకుంది. ఇంకా ఎవరెవరికి, ఏ సినిమాలకు పురస్కారాలు దక్కాయంటే…
* ఉత్తమ చిత్రం: కోడా
* నటుడు: విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
* నటి: జెస్సికా చాస్టెయిన్( ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ)
* దర్శకురాలు: జాన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)
* సహాయ నటుడు: ట్రాయ్ కాట్సర్(కోడా)
* సహాయ నటి: అరియానా డిబోస్( వెస్ట్ సైడ్ స్టోరీ)
* ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: డ్రైవ్ మై కార్ (జపాన్)
* డ్యాకుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది క్వీన్ ఆఫ్ బాక్సెట్‌బాల్
* షార్ట్(యానిమేటెడ్): విండ్ షీల్డ్ వైపర్
* షార్ట్ ఫిల్మ్(లైవ్ యాక్షన్): ది లాంగ్ గుడ్‌బై
* షార్ట్ ఫిల్మ్ (యానిమేటెడ్): ది విండ్‌షీల్డ్ వైపర్