OTT: ఓటీటీ వార్.. నెట్‌ఫ్లిక్స్‌కు చెమటలు పట్టిస్తున్న భారతీయ దిగ్గజం!

ప్రస్తుత డిజిటల్ యుగంలో వినోదం అంటే కేవలం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మాత్రమే అనే స్థాయికి ప్రేక్షకులు వచ్చేసారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచ సినిమా అరచేతిలో ఉంటోంది. ఈ క్రమంలోనే గ్లోబల్ ఓటీటీ మార్కెట్‌లో నంబర్ వన్ స్థానం కోసం దిగ్గజ సంస్థల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నప్పటికీ, దానికి అత్యంత సమీపంలోకి ఒక భారతీయ సంస్థ దూసుకురావడం విశేషం.

OTT

ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ సర్వీసుల జాబితాను పరిశీలిస్తే, నెట్‌ఫ్లిక్స్ 302 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే, రిలయన్స్ జియో, డిస్నీ హాట్‌స్టార్ విలీనం తర్వాత ఏర్పడిన ‘జియో హాట్‌స్టార్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి సవాల్ విసురుతోంది. కేవలం 300 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లతో ఇది రెండో స్థానంలో నిలిచింది. కేవలం రెండు మిలియన్ల తేడాతోనే నంబర్ వన్ పీఠానికి చేరువలో ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ క్రేజ్, తక్కువ ధరకే ప్లాన్స్ అందించడం ఈ సంస్థకు భారీగా ప్లస్ అయ్యింది.

ఈ రేసులో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో 200 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. షాపింగ్ బెనిఫిట్స్‌తో కూడిన మెంబర్‌షిప్ ప్లాన్ ఈ సంస్థకు స్థిరమైన యూజర్ బేస్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‌బీఓ మాక్స్ డిస్నీ+ వంటి గ్లోబల్ బ్రాండ్స్ ఉండగా, చైనాకు చెందిన టెన్సెంట్ వీడియో, ఐఖియీ (iQiyi) వంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వంద మిలియన్ల క్లబ్‌లో చేరి టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అమెరికాలో పాపులర్ అయిన పారామౌంట్+, హులు వంటి సర్వీసులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 స్ట్రీమింగ్ సర్వీసుల వివరాలు (సబ్‌స్క్రైబర్లు):

నెట్‌ఫ్లిక్స్: 302 మిలియన్లు
జియో హాట్‌స్టార్: 300 మిలియన్లు
అమెజాన్ ప్రైమ్: 200 మిలియన్లు
హెచ్‌బీఓ మాక్స్: 128 మిలియన్లు
డిస్నీ+: 127 మిలియన్లు
టెన్సెంట్ వీడియో: 117 మిలియన్లు
iQiyi: 101 మిలియన్లు
పారామౌంట్+: 77 మిలియన్లు
హులు: 55 మిలియన్లు
పీకాక్: 41 మిలియన్లు

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags