Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 13, 2025 / 08:02 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సూరజ్, షరాఫుద్దీన్ (Hero)
  • పూజా మోహన్ రాజ్ (Heroine)
  • సందీప్ ప్రదీప్, సాఫ్, అరుణ్ ప్రదీప్ (Cast)
  • మను స్వరాజ్ (Director)
  • విజయ్ బాబు - విజయ్ సుబ్రమణ్యం (Producer)
  • రాజేష్ మురుగేశన్ (Music)
  • మను (Cinematography)
  • Release Date : మే 08, 2025
  • KRG స్టూడియోస్ (Banner)

ఒక్కోసారి కొన్ని సినిమాలు భలే సర్ప్రైజ్ ఇస్తాయి. అలాంటి సినిమానే ప్రస్తుతం హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న “పడక్కలం”. మిస్టికల్ మిస్టరీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో మాత్రం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంతలా అలరిస్తున్న ఈ చిత్రం కథ ఏంటి? ఆకట్టుకుంటున్న అంశాలు ఏంటి? అనేది చూద్దాం..!!

Padakkalam Review

కథ: ఓ కాలేజ్ లో సిన్సియర్ ప్రొఫెసర్ షాజీ (సూరజ్), అదే కాలేజ్ లో తెలివైన ప్రొఫెసర్ గా అందరి మన్ననలు పొందుతూ పాపులర్ ప్రొఫెసర్ గా పేరొందుతాడు రెంజిత్ (షరాఫ్ ఉద్దీన్). వీళ్లిద్దరి మధ్య ఒకానొక సందర్భంలో ఇరుక్కుంటాడు జితిన్ (సందీప్ ప్రదీప్).

రెంజిత్ కి కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు జితిన్. అతడి నుంచి ఆ శక్తులు లాక్కునే క్రమంలో షాజీ-రెంజిత్-జితిన్ ఒక విచిత్రమైన సంఘటనలో ఒకరి శరీరంలోకి మరొకరి ఆత్మ పరకాయ ప్రవేశం జరిగిపోతుంది.

ఆ తర్వాత ఏం జరిగింది? ఎలాంటి పరిస్థితులు చవిచూడాల్సి వచ్చింది? దీన్ని మళ్లీ జతిన్ ఎలా సెటిల్ చేశాడు అనేది “పడక్కలం” కథాంశం.

నటీనటుల పనితీరు: ముగ్గురిలో రెంజిత్ పాత్ర పోషించిన షరాఫ్ ఉద్దీన్ విశేషంగా ఆకట్టుకున్నాడు. అతడి పాత్రలో రెండు విభిన్నమైన వేరియేషన్స్ ను చాలా బాగా పలికించాడు. అలాగే.. సందీప్ ప్రదీప్ కూడా మంచి నటనతో అలరించాడు. ఫస్టాఫ్ లో చాలా నార్మల్ గా ఉండే అతడి పాత్ర, సెకండాఫ్ కి వచ్చేసరికి భారీ ఛేంజోవర్ తో సినిమాకి మెయిన్ ఎసెట్ గా మారుతుంది.

ఇక సూరజ్ పాత్ర రెండు కోణాల్లోనూ కామెడీ క్యారెక్టర్ గానే ఉంటుంది. ఆ వేరియేషన్స్ ను డీసెంట్ గా పండించాడు సురాజ్.

ఇక స్నేహితుల పాత్రల్లో నటించిన కుర్రాళ్లు మరియు సురాజ్ భార్యగా నటించిన పూజా మోహన్ రాజ్ కనిపించిన కొన్ని సన్నివేశాలతోనూ ఆకట్టుకుంది.

సాంకేతికవర్గం పనితీరు: చాలా చిన్నపాటి సీజీ వర్క్ ఉన్నప్పటికీ.. కథ, కథనాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, ఆడియన్స్ ను సినిమా నుంచి డిస్కనెక్ట్ చేయకుండా డీసెంట్ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్ వర్క్ చాలా ప్లాన్డ్ గా ఉంది.

రాజేష్ మురుగేశన్ నేపథ్య సంగీతం బాగుంది. కామెడీ & సస్పెన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు.

దర్శకుడు మను స్వరాజ్.. సినిమా ఓపెనింగ్ లో మిస్టికల్ ఎలిమెంట్ ను ఇంట్రడ్యూస్ చేసి, ట్విస్టులతో ఫన్ జనరేట్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా ముఖ్యపాత్రధారులు ఒకరి శరీరంలోకి మరొకరు పరకాయ ప్రవేశం చేసిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో సీరియస్ నెస్ తోపాటు కామెడీని పండించిన విధానం బాగుంది. అలాగే.. ఎమోషనల్ గా సినిమాని నడిపిన విధానం కూడా అలరిస్తుంది. ఓవరాల్ గా.. లాజిక్స్ తో మ్యాజిక్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు దర్శకుడు మను స్వరాజ్.

విశ్లేషణ: మ్యాజికల్ మిస్టరీతో అలరించడం అనేది కొంచం ఈజీ టాస్క్ అనే చెప్పొచ్చు. అయితే.. దానికి కూడా సందర్భం, ఎమోషన్ సరిగ్గా కుదరాలి. అలా అన్నీ సమపాళ్లలో కాకపోయినా, ఓ మోస్తరుగా సెట్ అయిన సినిమా “పడక్కలం”. మంచి హ్యూమర్ ఉన్న ఈ సినిమాని ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా జియో హాట్ స్టార్ లో చూడొచ్చు.

ఫోకస్ పాయింట్: టైంపాస్ మిస్టికల్ డ్రామా!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Padakkalam

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version