డిసెంబర్ 14న పడిపడి లేచె మనసు ట్రైలర్!
- December 10, 2018 / 10:43 AM ISTByFilmy Focus
శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న పడిపడి లేచె మనసు ట్రైలర్ డిసెంబర్ 14న విడుదల కానుంది. ఈ చిత్ర ఆడియో జ్యూక్ బాక్స్ మార్కెట్ లోకి నేరుగా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ గురించి అఫీషియల్ ప్రకటన విడుదల చేసారు చిత్రయూనిట్. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని నేపాల్, హైదరాబాద్, కోల్ కత్తాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. మురళి శర్మ, సునీల్ ఇందులో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నఈ చిత్ర పాటలకు ఇప్పటికే అద్భుతమైన స్పందన వస్తుంది.
పడిపడి లేచె మనసుకు జేకే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న పడిపడి లేచె మనసు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















