Pakka Commercial Trailer: గోపీచంద్ కు మరో హిట్టు పడేలా ఉందిగా..!

సీటీమార్ తో హిట్ కొట్టి ఫాంలోకి వచ్చిన గోపీచంద్… మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. జిఎ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం నుండీ విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఫస్ట్ సింగిల్ కూడా మెప్పించింది.సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటని రచించారు. ఇదిలా ఉండగా..

ఈరోజు అనగా జూన్ 12 న గోపీచంద్ పుట్టినరోజు కావడంతో పక్కా కమర్షియల్.. కు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. పక్కా కమర్షియల్ ట్రైలర్లో మారుతీ మార్క్ కామెడీతో పాటు గోపీచంద్ మార్క్ యాక్షన్ కూడా ఉంది. ప్రతీరోజు పండగే చిత్రం తర్వాత మారుతీ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్న హీరోయిన్ రాశీ కన్నా ఈ మూవీలో కూడా కామెడీతో అలరించేలా ఉంది అని చెప్పాలి. సినిమాలో కాస్త పటాస్ సినిమా పోలికలు కూడా కనబడుతున్నాయి.

ఆ సినిమాలో తండ్రీ కొడుకులు పోలీసులు అయితే ఈ చిత్రంలో లాయర్లు. ఇందులో కూడా కొడుకు డబ్బు కోసం పరితపించే వాడిగా కనిపించబోతున్నట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. అయితే సినిమా మారుతీ స్టైల్ లో ఎంటర్టైన్ చేసే విధంగానే ఉందని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus