హీటెక్కించిన “పక్కా లోకల్” టీజర్!

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జనతా గ్యారేజ్ ఫీవర్ ఉంది. ఆ ఫీవర్ ని మరింత పెంచింది “పక్కా లోకల్” సాంగ్  టీజర్. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హుషారైన బీట్ తో ఈ సాంగ్ ని కంపోజ్ చేస్తే.. అందుకు కాజల్ అగర్వాల్ మరింత బూస్ట్ ని అందించింది. గ్రామీణ అమ్మాయి వస్త్రధారణలో కాజల్ అందాలు మతి పోగొడితే.. తారక్ స్టెప్పులు అదరగొడుతున్నాయి. ఇద్దరు బ్లాక్ డ్రస్సుల్లో గ్లామరస్ గా కనిపిస్తున్నారు.

కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న “జనతా గ్యారేజ్” పక్కా లోకల్ సాంగ్ టీజర్ బుధవారం విడుదలై యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటల ట్రైలర్లు సినిమాపై తారక్ అభిమానుల అంచనాలను పెంచాయి. తాజాగా పక్కా లోకల్ టీజర్ చూస్తుంటే ఈ పాట వెండి తెరపై మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరికీ కనువిందు చేయనుందని అర్ధమయింది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ “సినిమాలో “పక్కా లోకల్” పాట ఒక హైలెట్ గా నిలుస్తుంది.

అందరూ దీన్ని ఐటెం సాంగ్ అని పిలుస్తున్నారు. ఈ పాట కథలో భాగంగా .. అదీ కీలకమైన సందర్భంలో వస్తుంది, కాబట్టి ఇది స్పెషల్ సాంగ్.” అని చెప్పింది. ఇదే కాజల్ చేసే ఫస్ట్ అండ్ లాస్ట్ స్పెషల్ సాంగ్ అని ఆమె సన్నిహితులు వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus