పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో సీజన్7 విజేతగా నిలవడంతో ఆయన పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగింది. అయితే తాజాగా ఒక సందర్భంలో పల్లవి ప్రశాంత్ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. రైతుల కొరకు ప్రజల సపోర్ట్ ఉంటే నేను ఎంత దూరమైనా వెళ్తానని పల్లవి ప్రశాంత్ తెలిపారు. సీఎం అంటూ చేసిన కామెంట్స్ గురించి సైతం పల్లవి ప్రశాంత్ తనదైన శైలిలో స్పందించారు.
నన్ను సీఎం చేస్తే ఆదుకుంటానని చెప్పానని అది తప్పా అంటూ ఆయన ప్రశ్నించారు. అందరినీ ఆదుకునే దమ్ము, సామర్థ్యం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుందని పల్లవి ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. 14 వేల మందిని ఆదుకోవాలంటే మామూలు విషయం కాదని ఆయన కామెంట్లు చేశారు. నాకు రూపాయి ఆదాయం వస్తే ఆ మొత్తాన్ని 14 వేల మందికి ఎలా పంచాలని పల్లవి ప్రశాంత్ రివర్స్ లో ప్రశ్నించారు.
తక్కువ మొత్తం ఇస్తే ఇంతే ఇచ్చాడని కామెంట్లు వినిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. యువత మేల్కోవాలని ఇప్పటికైనా యువత ముందుకు వస్తే రైతులు బాగు పడతారని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ చేసిన కామెంట్లలో నిజం ఉన్నా ప్రతి ఒక్కరూ సీఎం కావడం అనేది అసాధ్యమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ కెరీర్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి.
రాజకీయాల్లో పల్లవి ప్రశాంత్ సక్సెస్ సాధించాలంటే సులువు కాదని అయితే ప్రయత్నం చేయడంలో మాత్రం తప్పు లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బును పేద ప్రజల కోసం ఖర్చు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. పల్లవి ప్రశాంత్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే పొలిటికల్ గా కొంతమేర సక్సెస్ సొంతమవుతుందని చెప్పవచ్చు.