Pallavi Prashanth, Amardeep: అమర్ ఫాన్స్ వర్సెస్ ప్రశాంత్ ఫ్యాన్స్…కార్ల పై దాడి!

  • December 18, 2023 / 11:20 AM IST

బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి కంటెస్టెంట్ లో అమర్ అలాగే పల్లవి ప్రశాంత్ మధ్య పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరి మధ్య నామినేషన్స్ లో భారీ స్థాయిలో వాదనలు వచ్చాయి. దీంతో పల్లవి ప్రశాంత్ అభిమానులు బయట సోషల్ మీడియాలో అమర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అమర్ భార్యతో పాటు తన తల్లిని కూడా భారీ స్థాయిలో బూతులతో ట్రోల్ చేశారు.

ఇలా తమ గురించి భారీ స్థాయిలో ట్రోల్స్ రావడంతో అమర్ తల్లి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వీరిని టార్గెట్ చేయడం మానేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలే జరగడంతో పెద్ద ఎత్తున అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుందని దీంతో ఒకరినొకరు కొట్టుకోవడమే కాకుండా ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా పగలగొట్టారని తెలుస్తుంది.

ఇక ఈ కార్యక్రమం పూర్తి అయ్యి అమర్ కారులో బయలుదేరుతూ ఉండగా కొంతమంది (Pallavi Prashanth) ప్రశాంత్ అభిమానులు అమర్ కారు వెనుక వైపు అద్దాలు అన్నింటిని కూడా పగలకొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఇది ఒక గేమ్ షో అని దీనిని గేమ్ షోలా చూడకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ప్రశాంత్ అభిమానులపై మండిపడుతున్నారు.

ఇక కేవలం అమర్ కారు మాత్రమే కాకుండా మరొక కంటెస్టెంట్ అయినటువంటి అశ్విని,భోలే, బిగ్ బాస్ బజ్ యాంకర్ గీతు రాయల్ కార్లను కూడా ధ్వంసం చేశారు దీంతో గీతు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. హౌస్ లో కొట్టుకున్నటువంటి కంటెస్టెంట్లు బయటకు రాగానే మంచి స్నేహితులగా మారుతున్నారు కానీ వీరి అభిమానులు మాత్రం మరింత శృతిమించి ఒకరినొకరు కొట్టుకోవడం సరైన పద్ధతి కాదు అంటూ పలువురు ఈ వివాదం పై కామెంట్లు చేస్తున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus