బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ అనేది మళ్లీ పెట్టాడు బిగ్ బాస్. గతవారం యావర్ ఇచ్చేసిన ఎవిక్షన్ ఫ్రీపాస్ కోసం హౌస్ మేట్స్ అందరూ కలిసి బ్యాలన్సింగ్ టాస్క్ లో పోటీ పడ్డారు. ఒక స్టంప్ పైన మరో స్టిక్ ని బాలన్స్ చేస్తూ బిగ్ బాస్ చెప్పిన ఐటమ్స్ ని ఒక దానిపై ఒకటి పేరుస్తూ ఈ టాస్క్ ఆడాల్సి ఉంటుంది. దీనికోసం ఐదుగురు ఒక సైడ్ మరో ఐదుగురు ఇంకో సైడ్ నుంచున్నారు. ఫస్ట్ రౌండ్ లోనే శోభాశెట్టి అవుట్ అయిపోయింది.
రెండు కప్ సాసర్ పెట్టేసరికి అన్నీ పడిపోయాయ్. ఆ తర్వాత శివాజీ చేయి నొప్పి వల్ల స్టిక్ ని విడిచిపెట్టేశాడు. దీంతో టాస్క్ ఎనిమిది మందితో నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చాలావరకూ పోరాడిన రతిక సాసర్ పైన పెట్టేసరికి పడిపోయింది. దీంతో రేస్ నుంచీ తప్పుకుంది. అలాగే గౌతమ్ కూడా చేయి నొప్పితో ఐటమ్స్ ని వదిలేశాడు. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఒక్కో ఐటమ్ ని చాలాసేపు ఉంచి హౌస్ మేట్స్ ఓపికకి పరీక్ష పెట్టాడు. అర్జున్, అమర్ దాదాపుగా ఒక్కసారిగా వదిలేశారు.
ఇలా ఒక్కో హౌస్ మేట్ రేస్ నుంచీ తప్పుకుంటుంటే, అశ్విని – ప్రియాంక ఇంకా పల్లవి ప్రశాంత్ మాత్రమే రేస్ లో మిగిలారు. చివరకి అశ్విని విడిచిపెట్టేసింది. దీంతో ప్రియాంక ఇంకా పల్లవి ప్రశాంత్ గేమ్ ని లాస్ట్ వరకూ ఆడారు. ఎంతోసేపు ఓపిగ్గా ఉన్న ప్రియాంక ఇంకో కమాండ్ ఇచ్చేసరికి వాటిని విడిచిపెట్టేసింది. లాస్ట్ వరకూ ఎంతో బ్యాలన్స్ చేసిన పల్లవి ప్రశాంత్ ని బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) అభినందించాడు. అంతేకాదు, చివర్లో టీజింగ్ గా ఉడతా ఉడతా ఊచ్ పాట పాడమని చెప్పాడు.
చివరి వరకూ అస్సలు బ్యాలన్స్ తప్పకుండా ఎంతో జాగ్రత్తగా పల్లవి ప్రశాంత్ గేమ్ ఆడి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని సొంతం చేస్కున్నాడు. అర్జున్ అవుట్ అయిపోయిన తర్వాత శివాజీ – అర్జున్ ప్రశాంత్ గురించే మాట్లాడుకున్నారు. ప్రియాంక – ప్రశాంత్ ఇద్దరిలోనే ఒకరు విజేత అవుతారని డిసైడ్ అయ్యింది. అయితే, స్టార్ మా బ్యాచ్ మాత్రం ప్రియాంక గెలవాలని అనుకున్నారు. కానీ ప్రశాంత్ గెలిచేసరికి ఏం చేయాలో అర్దం కాలేదు. దీంతో పల్లవి ప్రశాంత్ కి అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీపాస్ అనేది పల్లవి ప్రశాంత్ ఎవరికోసం వాడతాడు అనేది ఆసక్తికరం.