బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా బిగ్ బాస్ ట్రోఫీ అందుకొని బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈయన టైటిల్ సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినటువంటి ఈయన ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి రావడానికి గల కారణం ఏంటి అనే విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ నాకు హైదరాబాద్లో కూకట్ పల్లి మార్కెట్ తప్ప మరి ఏమి తెలియదని చెప్పారు.
ఒక వ్యక్తి మన నాన్నను మీ కొడుకు ఏం చేస్తారని అడగడంతో పొలం పనులు చేస్తాడు బాయికాడ పనులు చేస్తాడు అని చెప్పడంతో చాలా చీప్ గా చూసి మాట్లాడి వెళ్లిపోయాడు దాంతో నాకు బాధ అనిపించింది బాయి కాడ పనిచేసేటోడు ఏమైనా చేస్తాడు మనం ఏంటో నిరూపించుకుందాం. నేను హైదరాబాద్ పోతాను అని 500 రూపాయలు చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చానని ప్రశాంత్ తెలిపారు. ఇలా హైదరాబాద్ వచ్చిన నేను మనలాంటి వాళ్ళు బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఎందుకు వెళ్ళకూడదు అన్న ఆలోచన వచ్చింది
దీంతో ఎలాగైనా బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలని గట్టిగా నిశ్చయించుకున్నానని, నేను అనుకున్న విధంగానే బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చి బాయికాడ పనిచేసే వాళ్లు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపించుకున్నానని తెలిపారు. ఇక రతికతో రిలేషన్ గురించి మాట్లాడుతూ తనని చూడగానే మన కుటుంబం అనే ఫీలింగ్ కలిగిందని అందుకే తనతో క్లోజ్ గా ఉండే వాడినని తెలిపారు ఇక తానే నన్ను అక్క అని పిలువు అని చెప్పడంతో నేను తనని అక్క అని పిలిచాను అంటూ ప్రశాంత్ తెలిపారు.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!