Bigg Boss 7 Telugu: రెచ్చిపోయిన పల్లవి ప్రశాంత్..! లాజిక్ లేని రతిక పాయింట్స్..! లైవ్ లో ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ తో హౌస్ హీటెక్కిపోయింది. యాక్టివిటీ ఏరియాలో సింహం బొమ్మ నోట్లో హౌస్ మేట్స్ ఫోటోలు ఉన్న చికెన్ ని పెట్టి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అమర్ కి యావర్ కి పెద్ద యుద్ధమే జరిగింది. ఆ తర్వాత అమర్ తన కెప్టెన్సీ పోవడానికి కారణం అయిన రతికని సైతం నామినేట్ చేశాడు. ఆ తర్వాత గౌతమ్ పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. ఇక్కడే ఇధ్దరికీ పెద్ద ఫైట్ అయ్యింది. గత వారంలో నేను సంచాలక్ గా ఫైయిల్ అయ్యానని ఏ లాజిక్ తో అయితే నన్ను నామినేట్ చేశావో, ఇప్పుడు కూడ నువ్వు సంచాలక్ గా ఫైయిల్ అయ్యావంటూ పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు గౌతమ్.

వీరిద్దరికీ మాటల యుద్ధం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్నారు. నేను సంచాలక్ గా ఫైయిల్ అవ్వలేదని, వీకెండ్ నాగార్జున గారు చెప్పలేదని పల్లవి ప్రశాంత్ వాదించాడు. గౌతమ్ తన రెండో నామినేషన్ గా శివాజీని నామినేట్ చేశాడు. బాల్ గేమ్ లో ఫౌల్ ఆడారని, అలాగే శోభపై అరిచి యావర్ కోసం స్టాండ్ తీస్కోవడం నాకు నచ్చలేదని చెప్పాడు గౌతమ్. వీరిద్దరికీ కూడా మరోసారి మాటల యుద్ధం జరిగింది. చాలాసేపు వాదించిన తర్వాత నీతో గొడవ పెట్టుకోకూడదని అనుకుంటాను, కానీ నువ్వు అలా చేస్తావ్, నీ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నా రా అంటూ శివాజీ కన్ క్లూజన్ ఇచ్చాడు.

రతిక అమర్ ని తిరిగి నామినేట్ చేసి, తను ఎందుకు కెప్టెన్సీలో అమర్ టవర్ కూల్చానో వివరణ ఇచ్చింది. ఇక తర్వాత పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసింది. దీంతో ఇద్దరి మద్యలో మరోసారి ఆర్గ్యూమెంట్స్ పీక్స్ కి వెళ్లింది. పల్లవి ప్రశాంత్ మాట్లాడటం వల్ల యావర్ గేమ్ లో డిస్టర్బ్ అయ్యాడని రతిక చెప్పింది. దీంతో పల్లవి రెచ్చిపోయాడు. యావర్ కోసం నామినేట్ చేస్తున్నావా అంటూ నిలదీశాడు. అంతేకాదు, సింహంతో వేట పల్లవి ప్రశాంత్ ఆకలి ఆట మొదలెట్టాడనని చెప్పాడు. సినిమా డైలాగ్స్ బాగానే కొడుతున్నావ్ వచ్చి కూర్చో అంటూ రతిక రెచ్చిపోయింది. ఫైనల్ గా మరోసారి ఇద్దరికీ ఆర్గ్యూమెంట్స్ అయ్యాయి.

మద్యలో యావర్ ఇన్వాల్ అయ్యేసరికి ఇష్యూ పక్కదోవ కూడా పట్టింది. కెప్టెన్ ప్రియాంక సర్ధిచెప్తుంటే, నువ్వు ఇక్కడ కెప్టెన్ కాదు అంటూ యావర్ ప్రియాంకపై రెచ్చిపోయాడు. ఆ తర్వాత అర్జున్ యావర్ ని, శివాజీని నామినేట్ చేశాడు. బాల్స్ గేమ్ లో ఇద్దరూ పౌల్ ఆడారని చాలా స్మూత్ గా చెప్పాడు. తర్వాత పల్లవి ప్రశాంత్ గౌతమ్ ని నామినేట్ చేస్తూ రెచ్చిపోయాడు. నామినేషన్ పాయింట్స్ కాకుండా ఇష్యూ పర్సనల్ గా కూడా వెళ్లింది. అలాగే రతికని తిరిగి నామినేట్ చేస్తూ వివరణ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఇలా హౌస్ లో ఐదుగురు నామినేషన్స్ తోనే ఎపిసోడ్  (Bigg Boss 7 Telugu) ముగించేశాడు బిగ్బాస్.

ఇంకా ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే., ఆరో నామినేషన్ గా అశ్విని ఎవరినీ నామినేట్ చేయకుండా ఉండిపోయింది. దీంతో బిగ్ బాస్ అశ్వినిని నేరుగా నామినేట్ చేశాడు. లైవ్ లో మిగతా నామినేషన్స్ కూడా అయిపోయాయి. యావర్ అమర్ ని తిరిగి నామినేట్ చేశాడు. అలాగే, శోభాశెట్టి శివాజీని ఇంకా అర్జున్ ని నామినేట్ చేసింది. శివాజీ గౌతమ్ ని ఇంకా అర్జున్ ని నామినేట్ చేశాడు. ప్రియాంక శివాజీని ఇంకా యావర్ ని నామినేట్ చేసింది. దీంతో ఈవారం మొత్తం 8మంది నామినేషన్స్ లోకి వచ్చారు. కెప్టెన్ ప్రియాంక – శోభాశెట్టి తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus