ఈ హిప్ హాప్ కల్చర్ సౌత్ ఇండియాకు నార్త్ ఇండియన్స్ పరిచయం చేసినప్పట్నుంచి తెలుగు పాటలు వినడం ఆల్మోస్ట్ మానేశారు జనాలు. ఏదో కొత్త వచ్చి హిట్ అయిన పాటలు వింటున్నారు కానీ.. పాత పాటలు, క్లాసికల్ ఆల్బమ్స్ ను పట్టించుకొనేవారు లేకుండాపోయారు. పాత బంగారం లాంటి పాత పాటలను నవతరం శ్రోతలు కూడా విని ఆనందించేలా చేస్తున్నారు జామర్స్. ఈ ట్రెండింగ్ మ్యూజికల్ టీం.. “పలుకే బంగారమాయే” అనే క్లాసికల్ సాంగ్ కు రెట్రో & వెస్ట్రన్ మ్యూజికల్ టచ్ ఇచ్చి.. సాహిత్యం స్పష్టంగా వినబడేలా.. రీమిక్స్ చేసిన కొత్త వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
నిజానికి తెలుగు ప్రేక్షకులకు తెలుగు పాటలు చేరు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రెజంట్ జనరేషన్ పిల్లలు కానీ జనాలు కానీ తెలుగు పాటలు వినడం లేదు. అందుకు కారణం పాత పాటలు వింటుంటే బోర్ కొట్టడమే. అలా బోర్ కొట్టకుండా జామర్స్ & టీం పాత తెలుగు పాటలకు ట్రెండీ టచ్ ఇచ్చి రీమిక్స్ చేస్తుండడమే వాళ్ళ సక్సెస్ కు కారణం. వీళ్ళు ఇదే విధంగా మరిన్ని పాటల్ని తెలుగు ప్రేక్షకులకు రీఇంట్రడ్యూస్ చేసి.. స్వచ్చమైన తెలుగు పాటలకు రీస్టోర్ చేసిన పుణ్యం మూతగట్టుకొంటే బాగుంటుంది.