పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హర్రర్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ‘ది రాజాసాబ్’. అనేక సార్లు వాయిదా పడి ఫైనల్ గా డిసెంబర్ 5న ‘ది రాజాసాబ్’ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ డిసెంబర్ నాటికి వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కంప్లీట్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో 2026 సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వాటిని నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక విడుదల చేసిన టీజర్లో ‘ది రాజాసాబ్’ వరల్డ్ ని పరిచయం చేశారు.
నిధి అన్వేషణలో భాగంగా హీరో అండ్ హీరోయిన్స్ కి వెళ్లడం.. అక్కడ ఆత్మ వీళ్ళని ఇబ్బంది పెట్టడం వంటివి చూపించారు. ఆ ఆత్మకు సంబంధించిన బ్యాక్ స్టోరీ రివీల్ చేయలేదు. కానీ టీజర్లోని విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాయి. ఇక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇందులో జనవరి 9న ‘ది రాజాసాబ్’ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
ఇక ‘ది రాజాసాబ్’ ట్రైలర్ ను గమనిస్తే.. ఇది 3 నిమిషాల 34 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఈ ట్రైలర్ లో మెయిన్ గా ప్రభాస్ కామెడీని, హీరోయిన్లతో అతను చేసే రొమాన్స్ ను హైలెట్ చేశారు. సీరియస్ సిట్యుయేషన్లో కూడా ప్రభాస్ చేసే కామెడీ హైలెట్ అయ్యేలా ఉంది.’తాత అద్భుతాలు చూసి తరించాలి’ అనే డైలాగ్ ఉంది.
సో ఫ్యాన్స్ కూడా దర్శకుడు ‘మారుతి అద్భుతాలు చూసి తరించడమే’ అనుకోవాలి. మరోసారి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా అనిపిస్తుంది. విజువల్స్ కూడా టాప్ నాచ్ లో ఉన్నాయి. టీజర్ రేంజ్లో అయితే ట్రైలర్ ఆకట్టుకోలేదు.మీరు కూడా ఓ లుక్కేయండి :