పెద్ద నిర్మాణ సంస్థలో రూపొందే సినిమాలకి కూడా ఇలాంటి ఇబ్బందులా.. దారుణం..!

సినిమా (Movie) షూటింగ్ జరుగుతున్నప్పుడు యూనిట్ సభ్యులందరూ అలర్ట్ గా ఉండటం చాలా ముఖ్యం. అదే సమయంలో వాళ్లకు అన్ని సౌకర్యాలు ఉండాలి. మంచి ఆహారం, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, టాయిలెట్స్.. ఇలా అన్నీ చాలా ముఖ్యం. అవి లేనప్పుడు అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న సినిమాల విషయంలో ఇలాంటి సదుపాయాలు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ పెద్ద సినిమాల విషయంలో మాత్రం ఎటువంటి లోటు పాట్లు ఉండవు. అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఉండాలి కూడా..!

Movie

ఇవి అందుబాటులో లేకపోతే నిర్మాతలు కూడా తమ అసిస్టెంట్లపై మండిపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు పెద్ద సినిమాల (Movie) షూటింగ్ల విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు క్రూ మెంబర్స్ కి ఎదురవుతున్నాయి అంటే ఏమనుకోవాలి. అవును పెద్ద సినిమా షూటింగ్లో కాదు కాదు..ఓ పెద్ద నిర్మాణ సంస్థ నిర్మించే భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్లో కూడా క్రూ మెంబర్స్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవును ఓ పాన్ ఇండియా డైరెక్టర్, పాన్ ఇండియా హీరో కాంబినేషన్లో ఓ పెద్ద సినిమా (Movie) రూపొందుతుంది.

దీనిని టాలీవుడ్లోని ఓ బడా నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల ఓ షెడ్యూల్ ను తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పొరుగు రాష్ట్రంలో నిర్వహించారు. దీనికి ఇక్కడి నుండి చాలా మందిని అక్కడికి తీసుకెళ్లారు. కానీ అక్కడ క్రూ మెంబర్స్ కి సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడ్డారట. అన్నీ ఎలా ఉన్నా సరైన భోజనం కూడా లేదట. ఆకలికి వారు ఆగలేక.. ఆ తిండి తినలేక వారంతా చాలా ఇబ్బందులు పడినట్లు తెలుస్తుంది.

బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus