Pan-India Movies: వాళ్ల హిట్‌లు చూసి టాలీవుడ్‌ హీరోలు వాతలు పెట్టుకుంటున్నారా?

భారతీయ సినిమా పరిశ్రమ కన్‌ఫ్యూజన్‌లో ఉందా? ఏంటి ఇంత పెద్ద డౌట్‌ క్రియేట్‌ చేశారు అంటున్నారా? కచ్చితంగా పెద్ద డౌటే.. అయితే దీనికి కారణం మన సినిమా జనాలు తీస్తున్న సినిమాలు. అలా అని అందరినీ, అన్ని సినిమాను అనడం లేదు. పాన్‌ ఇండియా పేరుతో సినిమాలు చేస్తున్న వారినే అంటున్నాం. ‘బాహుబలి’ సినిమాలతో పాన్‌ ఇండియాకు రీసెంట్‌గా పునాది వేసిన రాజమౌళి.. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో దాన్ని ఇంకాస్త ఇంపాక్టివ్‌గా మార్చారు. అయితే అంతకుముందు పాన్‌ ఇండియా ఉన్నా.. అంత ప్రభావవంతంగా కాదు. ఆ విషయం పక్కనపెడితే..

రీసెంట్‌ టైమ్స్‌లో పాన్‌ ఇండియా (Pan-India) లెవల్‌ సినిమాలు తుస్‌ మనడం ఆలోచించదగ్గ విషయం. ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి పాన్‌ ఇండియా సినిమా తీయడంతో.. మాకు డోర్స్‌ తెరుచుకున్నాయి అని మణిరత్నం చెప్పారు. ఆయన అన్నట్లుగానే డోర్స్‌ తెరుచుకోవడంతో ‘కేజీయఫ్‌’, ‘పుష్ప’, అంటూ సినిమాలు వచ్చి భారీ విజయాలు అందుకున్నాయి. బాక్సాఫీసు దగ్గర రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి. ‘కాంతార’, ‘కార్తికేయ 2’ లాంటివి కూడా ఈ కోవకే చెందుతాయి. అయితే అంత స్థాయి వసూళ్లు మనం చూడలేం. అయితే ఇదే దారిలో ఆలోచించి ఇబ్బందిపడుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి.

దీంతో పాన్‌ ఇండియా మోజులో బరిలోకి దిగుతున్న హీరోలకు, తద్వారా సినిమా పరిశ్రమలకు కూడా మబ్బులు వీడిపోతున్నాయి అని అంటున్నారు. కావాలంటే మీరే చూసుకోండి.. పాన్‌ ఇండియా మోజులో తమ సినిమాలను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న సినిమాలు ఇబ్బందికర ఫలితాలు వస్తున్నాయి. సినిమా కథకు, అందులోని హీరోకు పాన్‌ ఇండియా స్థాయి ఉందా? లేకపోతే వస్తుందా? అనేది లేకుండా ఐదు భాషల్లో పోస్టర్లు రిలీజ్‌ చేసేస్తున్నారు. దీంతో అంచనాలు ఉంటున్నాయి కానీ లెక్కలు ఉండటం లేదు.

‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో పాన్‌ ఇండియా రిలీజ్‌ ప్రయత్నం చేసిన విజయ్‌ దేవరకొండ ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత ‘లైగర్‌’తోనూ అదే పరిస్థితి. ‘శ్యామ్ సింగ రాయ్‌’ సినిమాతో పాన్‌ ఇండియా విడుదల అని చెప్పిన నాని.. అక్కడ ఆశించిన స్పందన పొందలేదు. ఇప్పుడు ‘దసరా’ పరిస్థితీ అంతే. తెలుగులో వచ్చినంత రెస్పాన్స్‌ మిగిలిన దగ్గర లేదు అంటున్నారు. ‘కేజీయఫ్‌’ మాయలో వచ్చిన ‘కబ్జ’ ఇబ్బందిపడ్డాడు.

తెలుగులో సరైన విజయం లేదని సందీప్‌ కిషన్‌.. పాన్‌ ఇండియా అంటూ ‘మైఖేల్‌’ చేశాడు. అయితే సినిమాలో సత్తా లేకపోవడంతో బాక్సాఫీసు దగ్గర పత్తా లేకుండా పోయాడు. ‘ఫ్యామిలీ మేన్‌’ సిరీస్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సమంత ‘యశోధ’ను రెండు భాషల్లో చేసింది. ఇప్పుడు ‘శాకుంతలం’ను పాన్‌ ఇండియా రిలీజ్‌ చేసింది. ఈ రెండూ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి. అఖిల్‌ ‘ఏజెంట్‌’ను పాన్‌ ఇండియా అన్నారు కానీ.. ఎక్కడా అలాంటి ప్రచారం కనిపించడం లేదు. దీంతో పాన్‌ ఇండియా మబ్బులు మన వాళ్లకు వీడిపోయాయా లేక త్వరలోనే వీడిపోతాయా అనేది చూడాలి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus