చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!!

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ రామనాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి , నిర్మాత అల్లు అరవింద్ ,నాగబాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిధులుగా విచ్చేయగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు శివప్రసాద్, విజయ దుర్గ, చిరంజీవి తల్లి అంజనాదేవి, మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల హాజరయ్యారు.. కాగా మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ని ప్రారంభించగా, అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు.. నాగబాబు , అల్లు అర్జున్ స్క్రిప్ట్ ని అందజేశారు.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది..

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ సంస్థ గురించి , ఆ సంస్థ సాధించిన విజయాల గురించి అందరికి తెలిసిందే.. కొత్త వారి ప్రతిభను ప్రోత్సహించే దిశగా సుకుమార్ రైటింగ్స్ సంస్థ ద్వారా సుకుమార్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను.. రామ్ చరణ్ తో చేసిన ‘రంగస్థలం’ సినిమా తో ఈ సంస్థతో , సుకుమార్ గారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది..మంచి మనసున్న వ్యక్తులు ఈ సంస్థ నిర్మాతలు.. వీరికి సుకుమార్ కలిసి వైష్ణవ్ తేజ్ తో ఓ మంచి సినిమా ను తీయబోతున్నారు.. ఇంతచక్కటి అవకాశం ప్రారంభంలోనే లభించడం అదృష్టం..ఇలాంటి వారి అండదండలతో , వారు ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.. డైరెక్టర్ బుచ్చి బాబు చాల కొత్త కథ రాశాడు.. చాల ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి.. ఈ కథను నాకు నేరేట్ చేసినప్పుడు రస్టిక్ ఎలిమెంట్స్ కనిపించాయి.. రస్టిక్ అనగానే రంగస్థలం గుర్తుకువస్తుంది.. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు.. రంగస్థలం కథ చర్చల్లో బుచ్చిబాబు పాత్ర చాల ఉందని సుకుమార్ చాల సార్లు చెప్పారు..మరి అంత మంచి టాలెంట్ ఉన్న బుచ్చిబాబు ఈ కథని తయారుచేయడంలో చాల కష్టపడ్డారు.. ఎంతో కృషి చేసి ఈ కథతో మా అందరిని ఆకట్టుకున్నాడు..

బుచ్చిబాబు మనసు పెట్టి రాసిన కథ..అలాంటి బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు, వారిందరి మన్నననలు తప్పకుండా పొందుతాడు అని చెప్పగలను..ఈ సందర్భంగా యువ దర్శకునికి అల్ ది బెస్ట్ చెప్తున్నాను.. పెద్ద మనసున్న డైరెక్టర్ సుకుమార్.. తాను మాత్రమే ఎదగాలని కాకుండా తనతో పాటు ఇతరులు ఎదగాలని సుకుమార్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అలాంటి పెద్ద మనసున్న సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు..

నిర్మాత అల్లుఅరవింద్ మాట్లాడుతూ..ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాలో భాగమైనప్పుడే అర్థమయ్యింది.. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ అయన శిష్యుడు బుచ్చిబాబు చేస్తున్న మంచి సినిమా ఇది.. ఇందులో నటిస్తున్న వైష్ణవ్ , మనీషా కు కంగ్రాట్స్.. మైత్రి మూవీ మేకర్స్ మంచి బ్యానర్.. ఖర్చుకు వెనకాడకుండా డైరెక్టర్ కి అడిగిందల్లా ఇచ్చే మంచి నిర్మాణ సంస్థ.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడయ్యి సినిమా స్టామినా ను పెంచేసింది.. సినిమా కు పనిచేస్తున్న అందరికి అల్ ది బెస్ట్ అన్నారు..

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు చాల ఆనందంగా ఉంది.. నా శిష్యుడు ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది.. అద్భుతమైన కథ రాశాడు.. ఒక్క సిట్టింగ్ లోనే ఒకే చేసిన కథ ఇది..బుచ్చిబాబు గొప్ప డైరెక్టర్ అవుతాడని ఖచ్చితంగా చెప్పగలను.. వైష్ణవ్ కోసమే ఈ కథ పుట్టింది.. కథ రాస్తున్నప్పుడే వైష్ణవ్ అని ఫిక్స్ అయ్యాడు.. వేరే ఆప్షన్స్ చూడమన్నా వైష్ణవ్ ఈ సినిమా కి న్యాయం చేయగలడు అని ఒప్పించాడు.. ఈ ప్రాజెక్ట్ ఇంతదూరం రావడానికి కారణం ఈ సినిమా కథే.. మైత్రి మూవీ మేకర్స్ వారికి చాల థాంక్స్..పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్నా ఇలాంటి కొత్త సినిమా చిన్న సినిమా ను నిర్మించడం వారికే చెల్లింది.. కొత్తమ్మాయి మనీషా తెలుగమ్మాయి.. చాల మందిని టెస్ట్ చేసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు.. ఒక మంచి అమ్మాయి సినిమా కు ఎంపిక అయ్యింది.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న దేవిశ్రీప్రసాద్ కి చాలా థాంక్స్.. ఈ సినిమా ఆల్బం ఓ రేంజ్ లో ఉంటుంది.. తప్పకుండా చెప్పగలను.. వైష్ణవ్ కి మంచి ఫ్యూచర్ ఉంది.. కళ్యాణ్ గారి తర్వాత ఆయనంత సింప్లిసిటీ ఉంది వైష్ణవ్ కే.. ఈ సినిమా హిట్ తో వైష్ణవ్ కి మంచి సినిమా లు రావాలని కోరుకుంటున్నాను.. ఈ కథ ఇంత బాగా రావడానికి మెగాస్టార్ చిరంజీవి గారే కారణం. ఈ సినిమా కోసం చాలా సమయం కేటాయించి, ఇన్ పుట్స్ ఇచ్చి ఇంత బాగా కథ రావడానికి ఆయనే ముఖ్య కారణం.. అన్నారు..

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ నాకు హోమ్ బ్యానర్ అయ్యింది.. ఈ బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా, నేను మ్యూజిక్ చేసినా చేయకపోయినా సినిమా గురించి నాతో డిస్కస్ చేస్తారు.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా ఈ సినిమా లో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉంది.. రెండు బ్యానర్స్ తో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. బుచ్చిబాబు గారితో నాకు చాలారోజులనుంచి పరిచయం..సుకుమార్ గారితో చేస్తున్నప్పటినుంచి అయన తెలుసు.. ఎదుటి వ్యక్తి గురించి చాలా మంచి గా మాట్లాడే వ్యక్తుల్లో సుకుమార్ గారు ఫస్ట్ ఉంటారు అని నా అభిప్రాయం.. సుకుమార్ గారిని ఓ కథతో ఒప్పించడమే బుచ్చిబాబు ఆస్కార్ కొట్టినంత పనిచేశాడు.. ఈ సినిమా నేను చేయడానికి కారణం సుకుమార్ గారే.. బుచ్చిబాబు గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఈ సినిమా తప్పకుండ చేయాలనిపించింది.. ఏ కథైనా విన్నప్పుడు డిఫరెంట్ కథ, కొత్త కథ అంటాం కానీ ఈ కథ అంతకుమించిన డిఫరెంట్ స్టోరీ.. బిగినింగ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి.. తప్పకుండా ఈ సినిమా కు మంచి మ్యూజిక్ ఇస్తాను.. మెగా హీరోస్ అందరికి మ్యూజిక్ ఇచ్చాను.. చాలా థ్రిల్లింగ్ గా ఉంది.. అందరికి అల్ ది బెస్ట్ అన్నారు..

నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ.. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి, అల్లు అర్జున్ గరుకు, వరుణ్ తేజ్ గారికి, సాయి ధరమ్ తేజ్ గారికి ధన్యవాదాలు.. అందరు చెప్పినట్లు ఇది చాల మంచి కథ.. అద్భుతంగా వచ్చింది.. కథకు కావాల్సిన హీరో హీరోయిన్స్ యాప్ట్ గా దొరికారు.. ఈ సినిమా కు పెద్ద విజయం చేకూరుతుందని అనుకుంటున్నాను.. మీ అందరి ఆశీర్వాదాలు కావలి న్నారు..

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. సుకుమార్ సర్ కి చాల థాంక్స్..థాంక్స్ కూడా సరిపోదు.. అంతకు మించి ఎదో చెప్పాలనిపిస్తుంది.. నా మీద నమ్మకం ఉంచిన చిరంజీవి గారికి, మా అమ్మానాన్నలకు చాల థాంక్స్.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ తో మంచి సినిమా తీస్తాను.. దేవి గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిందేమి ఉండదు.. ఎవరైనా దేవుడు ముందు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు కానీ నేను మాత్రం దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఇవ్వండి సినిమా నిలబెడతాడు అని కోరుకుంటాను.. వైష్ణవ్ గారు ఈ సినిమా కి యాప్ట్ హీరో.. సినిమా చాల బాగుంటుంది.. కొత్తగా ఉంటుంది.. అందరు చూడండి అన్నారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus