కవిన్, అపర్ణ దాస్, మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్ మరియు వి టి వి గణేష్ ముఖ్య పాత్రల్లో గణేష కె బాబు దర్శకత్వంలో ఎస్ అంబేత్ కుమార్ సమర్పణలో తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దా..దా.. మూవీ నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ పై ఎం. ఎస్. రెడ్డి గారు నిర్మాతగా తెలుగులో పా..పా.. గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథి గా విచ్చేసిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన గారు మాట్లాడుతూ : సాధారణం గా ప్రతి సినిమాకి ట్రైలర్ చూపిస్తే వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంటాం. ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దా..దా.. తెలుగులో పా..పా.. గా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ దా..దా.. సినిమాని తమిళంలో ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రెడ్డి గారు నాకు చూపించడం జరిగింది. దా..దా.. అంటే నాన్న తెలుగులో పా..పా.. అంటే ఏంటి అన్నాను పా..పా.. అంటే కూడా నాన్న అన్నారు. ఈ సినిమా రైటర్ మరియు డైరెక్టర్ గణేష్ కె బాబు ప్రతి సీను చాలా బాగా రాసుకున్నాడు. ఏదైతే రాసుకున్నాడో ఎగ్జాక్ట్ గా అదే తీశాడు. తన రైటింగ్ స్టైల్ చాలా బాగా నచ్చింది. ఇది ఒక నాన్న కథ మాత్రమే కాదు ఒక స్నేహితుడు కథ ఒక ఒక అమ్మ కథ ఒక లవర్ కథ. రెండు షేడ్స్ లో హీరో కవిన్ క్యారెక్టర్రైజేషన్ చాలా బాగుంది. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా కేర్ తీసుకుని చేశారు. ఈ సినిమా నేను చూశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. నాకు చాలా నచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో మ్యూజిక్ బాగుంటుంది ఫోటోగ్రఫీ బాగుంటుంది ప్రజెంట్ జనరేషన్ కి తగ్గట్టుగా ఉంటుంది. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లో చూసి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత ఎంఎస్ రెడ్డి గారు మాట్లాడుతూ : ఎంతో బిజీగా ఉన్నా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన కమర్షియల్ డైరెక్టర్ ధమాకా, నేను లోకల్ వంటి చిత్రాలను దర్శకత్వం వహించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గతంలో సాహసం చేయరా డింభక అనే మూవీతో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు ఈ పా..పా.. సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. అతి త్వరలో ఉగాది శుభాకాంక్షలు తో ఆత్రేయపురం ఆణిముత్యం అనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని మీ ముందుకు తీసుకువస్తాము. ఈ మూవీతో మణికంఠ అనే ఒక కొత్త దర్శకుని పరిచయం చేయబోతున్నాను. ఈ దా..దా.. సినిమాని 50 రోజుల తర్వాత థియేటర్లో చూశాను అప్పటికి 70 శాతం ఫుల్స్ తో ఆడుతోంది. ఈ మూవీ చూసిన వెంటనే నచ్చి యుఎస్ లో ఉన్న నా ఫ్రెండ్స్ శ్రీకాంత్, శశాంక్ కి కాల్ చేసి చెప్పాను ఒక మంచి సినిమా చూశాను అని. చెప్పగానే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఈ సినిమాని తెలుగులో తీసుకొద్దామన్నారు. అతి త్వరలో ఈ సినిమాని మీ ముందుకు తీసుకు వస్తున్నాము. ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
నటీనటులు :
కవిన్, అపర్ణ దాస్, మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్ మరియు వి టి వి గణేష్
టెక్నీషియన్స్ :
ప్రొడక్షన్ : పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : ఎం ఎస్ రెడ్డి
సహ నిర్మాతలు : శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు
డి ఓ పి : కె ఎళిల్ అరుసు
సంగీతం : జెన్ మార్టిన్
రచయిత మరియు దర్శకుడు : గణేష్ కె బాబు
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పి ఆర్ ఓ : మధు VR
ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!
ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?