పూరీ జగన్నాథ్ శిష్యుడైన పరశురామ్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. నిఖిల్ హీరోగా తెరకెక్కిన యువత సినిమాతో పరశురామ్ దర్శకుడిగా పరిచయం కాగా తొలి సినిమాతోనే పరశురామ్ కు దర్శకుడిగా గుర్తింపు, సక్సెస్ దక్కింది. ఆ సినిమా సక్సెస్ తో రవితేజ హీరోగా ఆంజనేయులు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం పరశురామ్ కు దక్కింది. అయితే రిలీజ్ డేట్, సినిమాలోని కొన్ని డైలాగ్స్ వల్ల ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.
సోలో సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్న పరశురామ్ సారొచ్చారు సినిమాతో డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. సారొచ్చారు సినిమా నిర్మాతలకు కూడా భారీ నష్టాలను మిగిల్చిందని వార్తలు వచ్చాయి. సారొచ్చారు తర్వాత కొన్నేళ్ల పాటు పరశురామ్ కు సినిమా ఆఫర్లు రాలేదు. అయితే శ్రీరస్తు శుభమస్తు, గీతా గోవిందం సినిమాలతో పరశురామ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. 8 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన గీతా గోవిందం కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలను అందించింది.
అయితే సర్కారు వారి పాట సినిమాతో పరశురామ్ మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచారు. స్టార్ హీరోల సినిమాల విషయంలోనే పరశురామ్ తడబడుతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించే సమయంలో బలమైన కథ, కథనంతో సినిమాలను తెరకెక్కించాలి. ఆ విషయంలో పరశురామ్ పదేపదే ఫెయిల్ అవుతున్నారు.
పరశురామ్ తర్వాత సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ఈ సినిమాతో పరశురామ్ సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది. సర్కారు వారి పాట విషయంలో పరశురామ్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. పరశురామ్ స్క్రిప్ట్ ల విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.