Parasuram: ‘గీత గోవిందం’ కాంబినేషన్ రిపీట్!

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి విజయ్ కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ తోనే దర్శకుడు పరశురామ్ స్టార్ హీరోల దృష్టిలో పడ్డారు. ఏకంగా మహేష్ బాబుతో సినిమా తీశారు. అయితే ఇప్పుడు మరోసారి ‘గీత గోవిందం’ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని సమాచారం. ‘సర్కారు వారి పాట’ సినిమా తరువాత పరశురామ్..

నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేయాల్సివుంది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. అప్పటినుంచి మరో హీరో కోసం వెతుకుతున్నారు పరశురామ్. దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయాలి. దిల్ రాజు ఎన్ని కథలు వింటున్నా.. విజయ్ దేవరకొండకి ప్రాజెక్ట్ సెట్ చేయలేకపోతున్నారు. ఫైనల్ గా పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా ఓకే అయినట్లు టాక్. ‘గీత గోవిందం’ సినిమా తరువాత పరశురామ్ తో సినిమా చేయాలని విజయ్ కూడా అనుకుంటున్నారు.

అలా ఈ కాంబినేషన్ సెట్ అయిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నిజానికి ఇప్పటికే ‘ఖుషి’ షూటింగ్ పూర్తి కావాలి. కానీ సమంత కారణంగా షూటింగ్ ఆలస్యమవుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే ఆ తరువాత పరశురామ్ కథ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. నాగచైతన్య కోసం అనుకున్న కథనే..

ఇప్పుడు విజయ్ కి తగ్గట్లుగా మార్చి రాస్తున్నారట పరశురామ్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మరి ఈసారి ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి!

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus