Pawan Kalyan: పవన్ వాయిస్ అక్కడ వినబడాలన్న పరుచూరి గోపాలకృష్ణ!

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు జనసేన పార్టీ ద్వారా మంచి జరగాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కు చేదు ఫలితాలు ఎదురైనా 2024 ఎన్నికల్లో జనసేనకు కచ్చితంగా అనుకూల ఫలితాలు వస్తాయని ఆయన భావిస్తున్నారు. సినిమాలు చేస్తూ సంపాదిస్తున్న డబ్బును పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు, రైతులకు, కష్టాల్లో ఉన్న రైతుల కుటుంబాల కోసం ఖర్చు చేస్తున్నారు.

అయితే ప్రముఖ రచయితలలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ పవన్ కళ్యాణ్ గురించి తాజాగా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిఫరెంట్ సబ్జెక్ట్ లను ఎంచుకుంటున్నారని ఆయన అన్నారు. సినిమా వేరు రాజకీయాలు వేరని అయితే కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలలో సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం మనకు తెలుసని ఆయన కామెంట్లు చేశారు. సమాజాన్ని నా దృక్పథంలో మార్చాలనే ఆశయం పవన్ లో ఉందని ఆయన తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ లో కూడా అలాంటి ఆశయం ఉండేదని ఆయన వెల్లడించారు. ఈ సమాజాన్ని బాగు చేయడానికి మన వంతు చేయాలని పవన్ కు ఉందని పవన్ తన పోరాటం తను చేస్తున్న వీరుడు అని గోపాలకృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చట్టసభల ద్వారా వినిపించాలని నేను కోరుకుంటున్నానని గోపాలకృష్ణ తెలిపారు. 2024 ఎన్నికలలోపు జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి తరహా కథలను ఎంచుకుంటే బాగుంటుందని పవన్ కు పరుచూరి గోపాలకృష్ణ సూచించారు.

ఓటర్లు ఆశలు, ఆశయాలను నెరవేర్చే వాళ్ల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు. ఏపీ ప్రజల్లో పవన్ పై ప్రేముందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ అద్భుతంగా పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడే ఒక సినిమాను ఎంచుకోవాలని ఆయన సూచనలు చేశారు. పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus