ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పరుచూరి గోపాలకృష్ణ తాజాగా డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడుతూ ఆయన మృతికి నివాళులు అర్పించారు. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నటువంటి రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొద్దిరోజుల క్రితం మరణించిన సంగతి మనకు తెలిసిందే. రాకేష్ మాస్టర్ మరణం పై తాజాగా పరిచూరి స్పందిస్తూ తన సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ…
తాను రాకేష్ మాస్టర్ తో ఎక్కువగా పని చేయలేదని తన గురువుగారు ముక్కు రాజు గారితో తాను ఎన్నో సినిమాలు చేశానని పరుచూరి గోపాలకృష్ణ తెలియజేశారు.రాకేష్ మాస్టర్ ఇకలేరు అంటూ వార్త చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు. అయితే తన తండ్రి మరణం తరువాత తన కుమారుడు మాట్లాడుతూ ఇకనైనా మా నాన్న గురించి మాట్లాడటం ఆపేయండి అని చెప్పిన మాటలు వినగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయని పరుచూరి తెలిపారు.
ఇండస్ట్రీలో సుమారు 15 పాటలకు కొరియోగ్రఫీ చేసినటువంటి రాకేష్ మాస్టర్ ఎంతో అద్భుతమైన కొరియోగ్రాఫర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఈయన శిష్యులుగా జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. వారిద్దరూ మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకోవడం చాలా బాధ కలిగించిందని తెలిపారు.అయితే రాకేష్ మాస్టర్ ఆవేదనను ఎవరైనా పట్టించుకోని ఉంటే ఆయన పరిస్థితి మరోలా ఉండేదని పరుచూరి తెలిపారు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది అప్ కమింగ్ హీరోలు దర్శకులు ఎవరో ఒకరు ఆయనకు సినిమాలలో అవకాశాలు కనుక ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అయితే ఎవరు కూడా ఆయనకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయలేదంటూ ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాకేష్ మాస్టర్ గారి ఆత్మ పరమాత్మను చేరుకొని శివుడు కూడా ఆయన లయ విన్యాసాలుచూడాలని ఆకాంక్షిస్తున్న అంటూ ఈయన ఒక వీడియో ద్వారా ఈయన మరణం పై స్పందించి నివాళులు అర్పించారు.