ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది. దర్శకుడు శంకర్ (Shankar), హీరో రామ్ చరణ్ (Ram Charan) కాంబో కావడంతో జనాలు గట్టిగానే అంచనాలు పెట్టుకున్నారు. మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) ఈ సినిమాకి కథ ఇచ్చినా… శంకర్ టేకింగ్ మాత్రం మెప్పించలేదు. ఇక ప్రతి సినిమాకి పోస్ట్ రివ్యూలు ఇచ్చే సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) తన పంథాలో ‘గేమ్ ఛేంజర్’ పై పోస్ట్ రివ్యూ ఇవ్వడం జరిగింది.
ఆయన గేమ్ ఛేంజర్ సినిమా లెక్కల మీద కూడా మాట్లాడం జరిగింది. ఈ చిత్రానికి 350 నుంచి 425 కోట్లు అయ్యాయని అంటున్నారు. కానీ బాక్సాఫీస్ నుంచి ఈ చిత్రానికి సుమారుగా రూ.178 కోట్లు మాత్రమే రావడం చాలా దారుణం అని అన్నారు. ఈ మూవీ అంచనాలను అందుకోలేదని ఈ కలెక్షన్లను చూస్తేనే చెప్పవచ్చు అని అన్నారు. సముద్రఖని (Samuthirakani) వంటి పెద్ద నటుడికి సరైన పాత్ర లభించలేదని అన్నారు.
ఒక ఐఏఎస్ అవుదామని అనుకుని ఐపీఎస్ అయిన కుర్రాడి కథని సింపుల్‌గా కాకుండా దర్శకుడు జనాలను ఒకింత గందరగోళానికి గురి చేసే విధంగా శంకర్ దర్శకత్వం ఉందని పరుచూరి అన్నారు. పరుచూరి మాట్లాడుతూ… “జనాలు మోడ్రన్ స్క్రీన్ ప్లేకి అలవాటు పడ్డారు. పై సీట్లోనే కాదు.. కింది సీట్లోనూ ఆడియన్స్ ఉంటారని ఇక్కడ దర్శకులు గమనించాలి.. కింది స్థాయి వాళ్ళకి కథ ఎక్కకపోతే సినిమా అస్సలు ఆడనే ఆడదు. నా డ్రైవర్‌ని సినిమా గురించి అడిగితే..
ఇదేదో కలెక్టర్ కథ నాకు అర్థం కాలేదు! అని జవాబిచ్చాడు. పాత్రల్ని ప్రజెంట్ చేయడంలో తప్పు దొర్లిందని చివరగా పరుచూరి అభిప్రాయపడ్డారు. ప్రియురాలి కోసం కొట్టడం మానేసే కాన్సెప్ట్ రామ్ చరణ్ వంటి హీరోలకు అస్సలు సరిపడదు. రామ్ చరణ్ అద్భుతమైన మాస్ హీరో.. అలాంటి హీరోకి క్లాస్ టచ్ ఇవ్వడం రిస్క్ అని ఈ సినిమాతో తేలిపోయింది” అంటూ చెప్పుకొచ్చారు.