మహేష్ చేసిన పొరపాటే ప్రభాస్ కూడా చేశాడు..!

  • September 21, 2019 / 06:53 PM IST

ఆగష్టు 30 న విడుదలైన ప్రభాస్ ‘సాహో’ చిత్రం మంచి కల్లెక్షన్లని సాధించినప్పటికీ మంచి హిట్ గా మాత్రం నిలవలేకపోయిందనే చెప్పాలి. అయితే హిందీలో మాత్రం ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మధ్య కొన్ని సినిమాల పై తన అభిప్రాయాల్ని చెబుతూ ఆసక్తికరమైన కామెంట్లు చేసే పరుచూరి గోపాలకృష్ణ ‘సాహో’ చిత్రం పై కూడా కొన్ని సెటైర్లు వేశాడు. ‘సాహో’ చిత్రం ఎందుకు అంచనాలు అందుకోలేకపోయిందో ఆయన మాటల్లో వివరించాడు.

ఆయన మాట్లాడుతూ… ” ‘సాహో’ చిత్రం కొన్ని విభాగాల్లో మాత్రమే ఓహో అనిపించింది. టెక్నికల్ గా ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు దర్శకనిర్మాతలు. లేడీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలు మహేష్ , ప్రభాస్ మాత్రమే. అలాంటి హీరోలతో ఎలాంటి అద్భుతాలైనా చేయొచ్చు. మొదటి నేను ‘సాహో’ చిత్రం జేమ్స్ బాండ్ తరహా చిత్రం అనుకున్నాను. అందుకే భారీగా ఖర్చుచేస్తున్నారని భావించాను. ఇక చాలా చిత్రాల్లో కథాంశం ఒక్కటే ఉంటుంది.. కథనం మాత్రమే వేరేగా ఉంటుంది. ‘అర్జున్ రెడ్డి’ ‘దేవదాసు’ చిత్రాల కథాంశం ఒక్కటే..! అలా అంటే నన్ను చాలా మంది విమర్శించారు. ఇప్పుడు చెబుతున్నా.. ‘బాహుబలి’, ‘సాహో’ కథాంశం కూడా ఒక్కటే. ‘బాహుబలి’ లో మాహిష్మతి సామ్రాజ్యం.. ‘సాహో’ లో మాఫియా సామ్రాజ్యం. ‘బాహుబలి’ లో తండ్రిని చంపిన వాడిని కొడుకు హతమార్చి సింహాసనం అధిరోహిస్తాడు.. ఇక ‘సాహో’ లో కూడా అంతే. ఈ చిత్రంలో ‘1 నేనొక్కడినే’ చిత్రంలో జరిగిన పొరపాట్లే రిపీటయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో హీరోని.. హీరోయిన్ డామినేట్ చేసినట్లు అనిపించింది. ప్రతీకార కథ అని తెలియకుండా ట్విస్ట్ లు పెడితే ప్రయోజనం ఉండదు. దాదాపు అర్థ గంట పాటు క్లైమాక్స్ ఉండడం కూడా మైనస్సే…! నటనని పక్కన పెట్టి కేవలం యాక్షన్ సన్నివేశాలతో మెప్పించడం కష్టం. ప్రభాస్ గత చిత్రాలన్నీ యాక్షన్ కంటే అతడి పెర్ఫామెన్స్ ఆధారంగానే విజయం సాధించాయి. ఏది ఏమైనా ‘సాహో’ చిత్రానికి మంచి కలెక్షన్లు రావడం అయితే శుభపరిణామమే..” అంటూ చెప్పుకొచ్చాడు పరుచూరి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus