Paruchuri Gopala Krishna: సలార్ మూవీకి పరుచూరి షాకింగ్ రివ్యూ.. ఏం చెప్పారంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వాళ్లు సైతం ఈ సినిమాను చూసి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. విడుదలైన నాలుగు వారాలకే సలార్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రపంచ దేశాలలో సినిమా ఎన్ని రకాలుగా ఉంటుందో వాటన్నింటినీ ఒకే చోట చేర్చితే సలార్ అని ఆయన అన్నారు.

సలార్ మూవీ ప్రభాస్ వన్ మ్యాన్ షో అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని పరుచూరి పేర్కొన్నారు. మరో కీలకమైన వ్యక్తి ప్రశాంత్ నీల్ అని ఆయన డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అనుకునేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అని పరుచూరి చెప్పుకొచ్చారు. సలార్ ఇండియాలో జరిగిన కథగా చూపిస్తే ఈ సినిమాకు సెన్సార్ పూర్తి కాదని ఈ సినిమాలోని కొన్ని సీన్స్ లో తీవ్రత ఉందని ఆయన కామెంట్లు చేశారు.

సాధారణ కథగా సలార్ ను మొదలుపెట్టి స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ ఆటలాడుకున్నాడని పరుచూరి వెల్లడించారు. సినిమాలో 30 నిమిషాల వరకు హీరో మాట్లాడిన సందర్భాలు కనిపించలేదని పరుచూరి పేర్కొన్నారు. సలార్1 అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. ప్రభాస్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే, స్నేహ ధర్మం కోసం ఈ సినిమా చూడాలని చెబుతానని పరుచూరి వెల్లడించారు.

థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ మాత్రమే గుర్తుంటారని ఆయన అన్నారు. సలార్ మూవీతో గొప్ప సక్సెస్ ను అందుకున్న మూవీ టీమ్ కు అభినందనలు అని పరుచూరి వెల్లడించారు. పరుచూరి (Paruchuri Gopala Krishna) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus