Naa Saami Ranga: ఆ పాత్రలను చంపకుండా ఉంటే బాగుండేది.. పరుచూరి ఏమన్నారంటే?

  • February 24, 2024 / 04:34 PM IST

నాగార్జున విజయ్ బిన్నీ కాంబినేషన్ లో తెరకెక్కిన నా సామిరంగ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై బ్రేక్ ఈవెన్ అయినా కలెక్షన్ల పరంగా మరీ సంచలనాలు సృష్టించలేదు. అయితే పరుచూరి గోపాలకృష్ణ తాజాగా నా సామిరంగ మూవీని ఓటీటీలో చూసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నా సామిరంగ సినిమా మైనస్ ల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం. నా సామిరంగ సినిమా బాగుందని అయితే ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు మాత్రం రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏ నటుడికైనా, దర్శకుడికైనా, రచయితకు అయినా సంతృప్తినిచ్చే చిత్రాలు కొన్ని ఉంటాయని (Naa Saami Ranga) ఈ సినిమా కూడా ఆ జాబితాకు చెందిన మూవీ అని పరుచూరి పేర్కొన్నారు. దాసరి సినిమాలలో చివరి అరగంటకు ప్రాధాన్యత ఉంటుందని నేటి తరం యంగ్ డైరెక్టర్లు ఇది ఫాలో కావడం లేదని ఆయన అన్నారు. నా సామిరంగ మూవీలో ఫస్టాఫ్ లో రొమాన్స్ కు ప్రాధాన్యత ఇచ్చారని నవ్వులు పంచారని సెకండాఫ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.

పొరింజు మరియమ్ జోస్ కు కొన్ని మార్పులతో ఈ సినిమా తెరకెక్కింకారని కిష్టయ్య పాత్రను నాగ్ ప్రేమించారని రావు రమేష్ రోల్ ను ఇంటర్వెల్ తో ముగించకపోతే బాగుండనేది నా ఒపీనియన్ అని ఆయన అన్నారు. అల్లరి నరేష్ రోల్ ను అంతం చేయడం ఇబ్బందిగా అనిపించిందని పెద్ద హీరోల సినిమాల్లో పక్కన ఉండే పాత్రలు చనిపోతే హీరోలు జీర్ణించుకోలేరని పరుచూరి పేర్కొన్నారు.

రావు రమేష్, నరేష్ రోల్స్ ను అంతం చేయకుండా ఉండి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత బెటర్ గా ఉండేవని ఆయన తెలిపారు. క్లైమాక్స్ లో నాజర్ రోల్ ట్విస్ట్ ఆకట్టుకోలేదని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus