శ్రీవిష్ణు మూవీపై పరుచూరి రివ్యూ ఇదే.. ఆ సీన్స్ మైనస్ అయ్యాయంటూ?

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సామజవరగమన మూవీ చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా పెట్టుబడితో పోల్చి చూస్తే నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా తాజాగా ఈ సినిమాను చూసిన పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సామజవరగమన లవ్ స్టోరీ అని హీరో హీరోయిన్ల లవ్ సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? అనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగిందని పరుచూరి తెలిపారు.

ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా అదే మోతాదులో ఉందని ఆయన కామెంట్లు చేశారు. ఏ అమ్మాయిని హీరో మ్యారేజ్ చేసుకోవాలని భావిస్తాడో అదే అమ్మాయి అన్నయ్య అని పిలిచే పరిస్థితి ఉండటం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని పరుచూరి వెల్లడించారు. ప్రేక్షకులు ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారని ఆయన అన్నారు. కుటుంబంలో జరుగుతున్న పెళ్లి వల్ల ఆమెకు ప్రపోజ్ చేయలేడని ఆమెకు అన్నయ్యను కాదని అనలేడని పరుచూరి పేర్కొన్నారు.

హీరోహీరోయిన్లతో పాటు నరేష్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచారని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. రఘుబాబు కామెడీ బాగుందని సినిమా మొత్తం నవ్వులుపువ్వులతో సాగుతుందని ఆయన అన్నారు. హీరో హీరోయిన్ అన్నా చెల్లి అవుతారనే సీన్ రాఖీ కట్టే ఎపిసోడ్ సీన్ నిడివిని తగ్గించి ఉంటే బాగుండేదని ఆయన వెల్లడించారు. కథను సీరియస్ మోడ్ లోకి తీసుకెళ్లే సీన్స్ ఉండి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేదని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

ఏ సన్నివేశాన్ని అయినా ఒకే రసంతో కొనసాగిస్తే ప్రమాదమని సీరియస్ మోడ్ లో సినిమాను తీసుకెళ్లి ఉంటే ఈ సినిమాకు మరింత ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చేవని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత పేరెంట్స్ ను చూసుకోవడాన్ని పిల్లలు భారంగా భావిస్తారని అలాంటి సీన్లను ఈ సినిమాలో చూపించారని ఆయన పేర్కొన్నారు. సామజవరగమన మూవీకి పరుఛూరి ఇచ్చిన రివ్యూ నెట్టింట వైరల్ అవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus