Shah Rukh Khan: షారుఖ్ పై విమర్శలు.. వెనక్కి తగ్గిన బైజుసంస్థ!

ప్రముఖ బైజూస్ సంస్థ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కి సంబంధించిన ప్రకటనను తాత్కాలికంగా నిలిపివేసింది. ముంబై డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ దాఖలు చేసి బెయిల్ దరఖాస్తుని మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం మరోసారి తిరస్కరించిన నేపథ్యంలో బైజూ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎన్సీబీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్ ను ఆర్ధర్ రోడ్ జైల్లో క్వారెంటైన్ సెల్ లో ఉంచాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

షారుఖ్ నటించిన బైజూ సంస్థ యాడ్ లో స్టూడెంట్స్ ఎలా చదువుకోవాలో.. ఒక బాధ్యత గల తండ్రిగా పిల్లలకు ఏవిధంగా చదువులో సాయం చేయాలి వంటివి వివరించే ప్రకటనలు కావడం విశేషం. ఒక బాధ్యత గల తండ్రి.. కొడుకు ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకోకపోవడం ఏంటంటూ షారుఖ్ పై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి కూడా బైజు సంస్థ నిరాకరించింది.

 

ఇదిలా ఉండగా.. మరోపక్క ఆర్యన్ కు మద్దతుగా చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు పోస్ట్ లు పెట్టారు. ఆర్యన్ చిన్నపిల్లాడని.. అతనికి బెయిల్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లు ఆర్యన్ కు తమ మద్దతుని తెలియజేశారు. ఈరోజు సీనియర్ నటి రవీనా టాండన్ కూడా ఆర్యన్ ను సపోర్ట్ చేస్తూ సమాజంపై మండిపడింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus