Pavala Syamala: హైపర్ ఆది స్కిట్లపై పావలా శ్యామల షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

ప్రముఖ నటి పావలా శ్యామల గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో పావలా శ్యామల కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పావలా శ్యామల ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలల క్రితం పావలా శ్యామల చనిపోయారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ వార్తల గురించి పావలా శ్యామల స్పందిస్తూ జబర్దస్త్ షోలో చనిపోయిన వాళ్ల ఫోటోల పక్కన నా ఫోటోను పెట్టి చనిపోయాననే భావన కలిగించారని ఆమె చెప్పుకొచ్చారు. జబర్దస్త్ లో ఉండే హైపర్ ఆది నిర్మలమ్మ, మనోరమ పక్కన నా ఫోటో పెట్టి ఈవిడ ఎవరో తెలుసా.. ఈవిడ కూడా ఇప్పుడు లేరు అనే విధంగా ఆది చెప్పాడని పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వాళ్ల ఫోటో పక్కన మన ఫోటో పెట్టారంటే అర్థం ఏంటని పావలా శ్యామల ప్రశ్నించారు.

నేను ప్రస్తుతం సరిగ్గా నడవలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నానని (Pavala Syamala) ఆమె అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నేను హైపర్ ఆదిని పట్టుకుని అడగగలనా అని ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేయడం ద్వారా మనస్సును ఎంతగానో బాధ పెడుతున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. హైపర్ ఆది ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఒకరు ఇలా మాట్లాడితే ఏమైనా చేయొచ్చని అందరూ ఇలానే ఉంటే ఏం చేయగలమని పావలా శ్యామల చెప్పుకొచ్చారు.

నా గుండెలో రంధ్రాలు ఉన్నాయని నాకు కిడ్నీ సమస్య కూడా ఉందని పావలా శ్యామల వెల్లడించారు. నేను, నా కూతురు వృద్ధాశ్రమంలో ఉన్నామని నెలకు 30,000 రూపాయలు ఖర్చు అవుతోందని ఆమె చెబుతున్నారు. నన్ను చంపుకు తింటున్నారని పావలా శ్యామల చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus