టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరైన పవిత్ర లోకేశ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటంతో పాటు ఆమెకు భారీ స్థాయిలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవిత్ర లోకేశ్ తన ఫస్ట్ క్రష్ నాగార్జున అని వెల్లడించడం గమనార్హం. గతంలో పవిత్ర లోకేశ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పవిత్ర లోకేశ్ మాట్లాడుతూ రజనీకాంత్ గురించి చెప్పడం సులువు కాదని రజనీకాంత్ గారిని ఒకసారి కలిశానని ఆయనతో కలిసి దిగిన ఫోటో నా దగ్గర ఉందని చెప్పుకొచ్చారు.
గుప్త గామిని అనే సీరియల్ లో నేను నటించానని ఆ సీరియల్ హీరోకు రజనీకాంత్ క్లాస్ మేట్ అని పవిత్ర లోకేశ్ కామెంట్లు చేశారు. ఆ సీరియల్ సెట్ కు రజనీకాంత్ గారు మారు వేషంలో వచ్చారని పవిత్ర లోకేశ్ వెల్లడించడం గమనార్హం. చిరంజీవి గారిని రియల్ లైఫ్ లో ఎప్పుడూ కలవలేదని ఆమె కామెంట్లు చేశారు. నాగార్జున గారిని కలిశాను కానీ మాట్లాడలేదని నాగార్జున గారితో మాట్లాడేంత ధైర్యం లేదని ఆమె వెల్లడించారు.
నేను ఆరో తరగతిలో ఉన్న సమయంలో గీతాంజలి సినిమాను చూశానని పవిత్ర లోకేశ్ పేర్కొన్నారు. ఆ సమయంలో నాగార్జున గారు ఫస్ట్ క్రష్ అయ్యారని పవిత్ర లోకేశ్ కామెంట్లు చేయడం గమనార్హం. నాగార్జున గారిని రెండు మూడుసార్లు కలిశానని ఆమె పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ గారితో చాలా సినిమాలలో యాక్ట్ చేశానని పవిత్ర లోకేశ్ చెప్పుకొచ్చారు.
పవిత్ర లోకేశ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా సినిమా ఆఫర్లు కూడా భారీ రేంజ్ లోనే వస్తున్నాయి. పవిత్ర లోకేశ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. పవిత్ర లోకేశ్ రోజుకు లక్ష రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!