బాలీవుడ్‌లో ముద్దుగుమ్మగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న శ్రద్దా కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ఆరంభం నుంచే విభిన్నమైన పాత్రలు, క్యూట్ ఇమేజ్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటుంది. సినిమాలతో పాటు బ్రాండ్ ప్రమోషన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
తెలుగు ప్రేక్షకులకు కూడా శ్రద్ధ కపూర్ బాగా పరిచయమే. ప్రభాస్ సరసన నటించిన ‘సాహో’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ప్రభాస్–శ్రద్ధ జోడీకి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యింది. ముఖ్యంగా హారర్ కామెడీగా జానర్ లో తెరకెక్కిన ‘స్త్రీ – 2’ ఘన విజయం సాధించడంతో ఆమె మార్కెట్ మరింత పెరిగింది.
ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే… ప్రస్తుతం శ్రద్ధ వయసు 38 సం.లు అయినప్పటికీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఆమెతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన పలువురు హీరోయిన్లు ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయినా, శ్రద్ధ మాత్రం కెరీర్‌పైనే ఫోకస్ పెట్టింది. అయితే గత కొంతకాలంగా ఆమె ప్రేమ, పెళ్లి విషయాలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రచయిత రాహుల్ మోడీ తో ఆమెకు సన్నిహితంగా ఉంటున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఆమె ఎప్పుడు స్పందించిన దాఖలాలు లేవు.
తాజాగా ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రచారంలో పాల్గొన్న శ్రద్ధ, లవ్ మరియు బ్రేకప్ గురించి చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. అదే సమయంలో అభిమానులు “పెళ్లెప్పుడు?” అంటూ ప్రశ్నలు వేయగా, ఆమె “తప్పకుండా పెళ్లి చేసుకుంటాను” అంటూ నవ్వుతూ సమాధానం ఇవ్వడం మరింత ఆసక్తిని రేపింది. దీంతో ఫిబ్రవరిలో శుభవార్త చెప్పబోతోందన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
ప్రస్తుతం సినిమాల పరంగా కూడా శ్రద్ధ ఫుల్ బిజీ. రాబోయే రోజుల్లో స్త్రీ 3, భేడియా 2 వంటి ప్రాజెక్టులు, అలాగే ఇతర కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇటు కెరీర్, అటు వ్యక్తిగత జీవితం… రెండింట్లోనూ శ్రద్ధ కపూర్ పేరు ఇప్పుడు బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఈ పెళ్లి వార్తలపై ఆమె ఎప్పుడు అధికారిక క్లారిటీ ఇస్తుందో చూడాలి.