Chiranjeevi: చిరంజీవిపై అభ్యంతరకర కామెంట్స్.. ఎందుకంటే..?

మెగాస్టార్ చిరంజీవిపై ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభ్యంతరకర కామెంట్స్ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఏంటంటే.. చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రశంసించడమే అని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినిమా ఇండస్ట్రీ, దాని అనుబంధ విభాగాలకు జగన్ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు 2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు విద్యుత స్థిర చార్జీల చెల్లింపును రద్దు చేసింది.

రాబోయే ఆరు నెలలకు వాయిదా కరెంట్ బిల్స్ ను చెల్లించడానికి అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు.. బ్యాంక్ ల నుండి సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. సినిమా ఇండస్ట్రీ మేలు కోసం ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జగన్ ఆడుకున్నారని ప్రశంసించారు చిరంజీవి.

హీరో నాగార్జున కూడా జగన్ కి కృతజ్ఞతలు చెప్పారు. అయితే జగన్ ను అభినందిస్తూ.. చిరంజీవి ట్వీట్ చేయడాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిరు ట్వీట్ పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమ్ముడి రాజకీయ భవిష్యత్తుని ఇరకాటంలో పడేసేలా చిరు ట్వీట్ ఉందని మరికొందరు కామెంట్స్ చేశారు. మరికొందరైతే పవన్ పై అభ్యంతరకర కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus