అన్నయ్య అంటే అందుకే గౌరవం : పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవిని అమితంగా అభిమానించే వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు ఉంటారు. ఈ విషయాన్ని ఆయన మరో సారి స్పష్టం చేశారు. లండన్లో జరిగిన యుక్తా (UKTA-యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్) 6వ వార్షికోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ఈస్ట్ లండన్ లోని ట్రాక్సీ థియేటర్లో శనివారం  గ్రాండ్ గా నిర్వహించారు. దాదాపు 2 వేల మంది తెలుగు వారు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.

ఈ వేడుకల అనంతరం పవర్ స్టార్ ఎన్నారై లతో సమావేశమయ్యారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్బంగా తన అన్నయ్య చిరంజీవి గొప్పదనాన్ని గుర్తుచేకున్నారు. “మాది ఓ మధ్య తరగతి కుటుంబం. మాకు ఓ రోజు సినిమాకు వెళ్లడమంటే అదే పెద్ద పండగ. అటువంటిది సినిమాలో నటించాలి అని థాట్ రావడమే కష్టం. కానీ అన్నయ్య నటుడిగా మారాలని కలలు కని, కష్టపడి .. ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఓ స్టేజ్ కి వచ్చారు. అలా ఒక రంగంలో సొంతకాళ్ల మీద నిలబడాలంటే చాలా గ్రేట్.

అందుకే అన్నయ్య అంటే నాకు చాలా గౌరవం” అని పవన్ చెప్పారు. ” నాకు అడ్డు తగిలిన వారిపై ఎప్పుడూ కోపగించుకోను.. మరింతగా ఎదగడానికి, మన టాలెంట్ ని పెంచుకోవటానికి వారు సహాయపడ్డారని సంతోషిస్తాను. ఇది కూడా అన్నయ్య  నుంచే నేర్చుకున్నాను” అని పవర్ స్టార్ మెగా స్టార్ గురించి వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus