Pawan Kalyan: సినీ కెరియర్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన పవన్!

  • August 11, 2023 / 08:48 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా రాజకీయ ప్రచార కార్యక్రమాలలో కొనసాగుతూనే ఇప్పటికే ఈయన పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా మారిపోయారు.అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈయన పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన కమిట్ అయినటువంటి హరిహర వీరుమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి సినిమాలు ఎన్నికల తర్వాతనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తుంది.

ఇక తాజాగా విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో వారాహి యాత్రలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలియజేశారు. తాను సుస్వాగతం సినిమా కోసం ఇదే జగదాంబ సెంటర్లో ఒక బస్సుపై నిలబడి డాన్స్ చేయాల్సి వచ్చింది. పదిమందిలోకి రావాలంటే ఎంతో సిగ్గుపడే తనకు తన వదిన బలవంతంగా సినిమాలలోకి పంపించారు. ఆరోజు నేను బస్సులో డాన్స్ చేసి ఎంతో ఇబ్బంది పడ్డాను ఆ క్షణం మా వదినకు ఫోన్ చేసి ఎందుకు నన్ను సినిమాలు లోకి పంపించారు.

ఇకపై నేను సినిమాలలో నటించను ఇదే నా ఆఖరి సినిమా అంటూ ఆరోజు వదినతో మాట్లాడాను కానీకాలం ఎంతో గొప్పది నన్ను పారిపోనివ్వకుండా ఇండస్ట్రీలోనే కొనసాగేలా చేసింది అయితే దాదాపు 25 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే జగదాంబ సెంటర్లో ఇలా వారాహి యాత్ర ద్వారా మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నాకు ప్రజలలోకి రావాలంటే ఎలాంటి సిగ్గు భయం లేదు ఎంతో ధైర్యంతో ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసమే అందరి ముందుకు వచ్చాను.

ఇక ఈసారి నేను ఎవరికీ కంప్లైంట్ చేయను మన రాష్ట్రం కోసం.. మన ప్రజల కోసం.. మన సమాజం కోసం. ఈ సారి నేను ఎవరికి కంప్లైంట్ చేయట్లేదు సంతోషంగా, చాలా ధైర్యంగా ఇన్ని కోట్ల మంది ప్రజల కోసం… ఇలాంటి ప్రభుత్వంతో పోరాటడానికి ఆ గుండె దైర్యం విశాఖ పట్నం ఇచ్చింది అంటూ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus