Pawan Kalyan: తల్లి ఆరోగ్యం గురించి తొలిసారి మాట్లాడిన పవన్‌.. ఏం చెప్పారంటే?

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రతి నెలకు ఓసారి ఈ వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కాంపౌండ్‌ నుండి ఎవరో ఒకరు వీటిని ఖండిస్తూనే ఉన్నారు. అయితే చిరంజీవి ఇంటి దగ్గర పరిస్థితి గమనిస్తే.. ఏదో ఇబ్బంది ఉంది అని మాత్రం అర్థమవుతోంది. ఎందుకంటే ఎప్పుడూ లేని హడావుడి ఇప్పుడు కనిపిస్తోంది అంటున్నారు. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు అసలు విషయాన్ని తెలిపేలా చేశాయి.

Pawan Kalyan

ఇన్నాళ్లుగా వస్తున్న పుకార్లలో కొంతమేర నిజం ఉంది. అంజనా దేవి గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అందుకే పవన్‌ ఒక్కోసారి హఠాత్తుగా చిరంజీవి ఇంటికి వస్తున్నారు. కేబినెట్‌ సమావేశాన్ని వదులుకుని మరీ వచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణే చెప్పుకొచ్చారు. పవన్‌ తన కొత్త సినిమా ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడినప్పుడు ఈ విషయం కూడా బయటకు వచ్చింది.

అమ్మ ఆరోగ్యం గురించి బయటకు తెలియకూడదనే ఉద్దేశంలో అలా చెప్పామని.. అమ్మ ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే అమ్మ కోలుకుంటుందని పవన్‌ చెప్పారు. దీంతో అంజనా దేవికి ఏమైంది? అని మెగా అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. వయసు పెరగడం వల్ల వచ్చిన ఇబ్బందులతో అంజనా దేవి ఆసుపత్రిలో చేరారు అని గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు కూడా అదే కారణం అని చెప్పొచ్చు.

పైన చెప్పినట్లు అంజనా దేవి ఆరోగ్యం గురించి మెగా కాంపౌండ్‌ ఎప్పుడూ ఆల్ ఈజ్‌ వెల్‌ అనే చెబుతోంది. అది అలానే కొనసాగాలని ఆమె మరికొన్నేళ్లు తన తనయుల వృద్ధిని చూసి సంతోషించాలని మనమూ కోరుకుందాం. ఇక పవన్‌ సినిమాల విషయానికొస్తే ‘హరి హర వీరమల్లు ’ పార్ట్‌ 1 ఈ నెల 24న విడుదలవుతోంది.

చాలా రోజులకు మాట్లాడిన పవన్‌.. వైరల్‌ కామెంట్స్‌ ఏమేం చేశాడో చదివేయండి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus