భోళా శంకర్’ ట్రైలర్ లో చిరుని హైలెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ పెట్టారు అది చాలదు అన్నట్లు ‘ ‘రంగస్థలం’ లో రాంచరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడురా’ అనే డైలాగ్ కూడా పెట్టారు. చిరుని హైలెట్ చేయడానికి.. ఆయన తన తమ్ముడు, తనయుడితో పోల్చుకుని తక్కువ చేసుకోవాలా అని చిరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొంతమంది హర్ట్ అయ్యారు. వాస్తవానికి చిరు సాధించనిది అంటూ ఏమీ లేదు. నథింగ్ అనే స్టేజి నుండీ ఆయన ఈ రేంజ్ కి వచ్చారు.
ఓ రకంగా చిరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆవేదన కరెక్టే. దీని గురించి ఇటీవల దర్శకుడు మెహర్ రమేష్ ను ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. మెహర్ రమేష్ మాట్లాడుతూ.. ‘ అన్నయ్య సినిమాల్లోకి వచ్చింది కొత్తగా ఏదో సాధించాలి అని కాదు. ట్రైలర్ లో చెప్పినట్టు ఆయన ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను అని ట్రైలర్ లో చెప్పినట్టు.. తిరిగి సినిమాల్లోకి వచ్చింది కూడా ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే.పవన్, చరణ్ రిఫరెన్స్ లు ఆయనకి నచ్చకపోతే ఆయనే నో చెప్పేస్తారు.
ఇంకో విధంగా చెప్పాలి అంటే 30 ఏళ్ళ క్రితం చిరంజీవి అభిమానికి ఇప్పుడు కొడుకో, కూతురో అంటున్నారు.వాళ్ళు కూడా చిరంజీవిని గౌరవిస్తున్నారు. అలాగే పవన్, చరణ్ లను విపరీతంగా అభిమనిస్తున్నారు. వాళ్ళను కూడా ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే చరణ్ , పవన్ రిఫరెన్స్ లు వాడాం. సినిమాలో (Bhola Shankar) అవి వాడిన సందర్భాలు కూడా మెప్పిస్తాయి.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!