పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు..పొలిటికల్ లీడర్, ఇంకా చెప్పాలి అంటే ఒక పార్టీకి అధినేత. అయితే తాజాగా జరిగిన జనసేన పొలిటికల్ సభలో గర్జించిన పవన్. త్వరలో ప్రజల్లోకి వస్తున్నాను అని తెలిపాడు. ఇక అదే పనిగా తన సినిమాలను సైతం ప్లాన్ చేసుకుంటున్నాడు…అందుకే ప్రస్తుతం పవన్ డాలీ నటిస్తున్న తాజా చిత్రాన్ని త్వరగా పూర్తి చెయ్యాలి అని ఆలోచనలో ఉన్నాడు.
కేవలం 50 రోజుల్లోనే ఈ మూవీకి సంబంధించి తన పార్ట్ ను షూటింగ్ చేసేయాలని, తన పార్టీ కార్యక్రమాలు ఎలాను ఉంటాయి కాబట్టి వర్సగా కాకపోయినా, రెండు మూడు షెడ్యూల్స్ లో పూర్తి చేసేలా పవన్ ఆలోచనలు చేస్తున్నాడు. అందుకే దర్శకుడు కూడా ముందుగా పవన్ పాత్రకు సంబందించిన సన్నివేశాలను తెరకెక్కించేసి ఆతరువాత మిగిలిన సినిమా తీయాలి అని పాల్న్ చేశాడట. ఇదిలా ఉంటే ఈ సినిమా కధ ఫ్యాక్షన్ కధ అని తెలిసిన సమయం నుంచి ఈ సినిమాపై రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి, అందులో ‘కడప కింగ్’ అనే టైటిల్ ఎక్కువగా వినిపించింది.
అంతవరకూ బాగానే ఉంది కానీ..తాజాగా ‘కాటమ రాయుడు’ అనే టైటిల్ పై పవన్ అండ్ టీమ్ కన్ను పడినట్లు సమాచారం. ఆ టైటిల్ ని ఫైనలైజ్ చేసే ఛాన్సులున్నాయని తెలుస్తోంది. అత్తారింటికి దారేది మూవీలో ‘కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా’ అని పవన్ కళ్యాణ్ పాట పాడిన తర్వాత.. జనాలకు ఈ పదం బాగా నోటెడ్ అయిపోయింది. అందుకే ఆ టైటిల్ అయితే బావుంటుంది అని సినిమా యూనిట్ భావిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.