మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా కుటుంబ సభ్యుల బ్యానర్లోనే చిత్రాలు చేయనున్నట్లు తెలుస్తోంది. తనయుడు రామ్ చరణ్ తేజ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో చిరు తన 150 వ మూవీ చేస్తున్నారు. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత మెగాస్టార్ తన బావ మరిది అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారు. దీనికి బోయపాటి శ్రీను డైరక్టర్ గా ఖరారు అయ్యారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.
దీని తర్వాత తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో నటించనున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో అన్నయ్య 152 వ సినిమాను నిర్మించేందుకు పవన్ ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రానికి డైరక్టర్ ఎవరో తెలుసా? పవన్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రెండురోజుల క్రితం మాటల మాంత్రికుడు మెగాస్టార్ కి స్టోరీ చెప్పడం, అందుకు ఆయన ఒకే చెప్పడం కూడా జరిగిపోయిందని సమాచారం. ఈ ముగ్గురి కలయిక వినడానికే అద్భుతంగా ఉంది. ఇక ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే మహా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా పూర్తి వివరాల కోసం మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.