Pawan Kalyan, Chiranjeevi: చిరంజీవి గారు నాకొక ఎమోషన్.. పవన్ కళ్యాణ్ ట్వీట్!

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో అభిమానులు, రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా చిరుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమా ఇండస్ట్రీ కోసం, అభిమానుల కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పారు. ‘నేను ప్రేమించే, గౌరవించే.. ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయ్, కీర్తి దక్కాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చారు. మరో ట్వీట్ లో.. ‘గ్రామీణ భారతదేశం కోసం పని చేసిన ఒక మేధావికి బర్త్ డే సందేశాన్ని ఫార్వార్డ్ చేస్తున్నాను. చిరంజీవి గారు నాకొక ఎమోషన్. ఆయన ‘రుద్రవీణ’ సినిమా నాపై పెద్ద ప్రభావాన్ని చూపింది. ఆ సినిమా నన్ను భారతదేశంలోని గ్రామాల గురించి తెలుసుకునేలా.. వాటికోసం పని చేసేలా చేసింది.

దయచేసి చిరంజీవి గారికి హృదయపూర్వక బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేయండి’ అంటూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన చాలా మంది హీరోలు చిరుకి బర్త్ డే విషెస్ చెప్పారు. ‘నా ఇన్స్పిరేషన్, నా ప్రియమైన మామ, హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి. మీరు సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించాలని.. జీవితంలో మాకు ఇలా స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ ధరమ్ తేజ్ రాసుకొచ్చారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus