“బాహుబలి”పై పవర్ స్టార్ కామెంట్స్!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాధారణంగా స్టేజ్ పైనే చాలా తక్కువ మాట్లాడతాడు. తన సినిమా గురించే ఆయన మాట్లాడటం చాలా తక్కువ అలాంటిది టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హిట్స్ గా నిలిచిన రెండు సినిమాల గురించి వాటిపై ఆయన ఆలోచన గురించి ఒకానొక ఇంటెర్వ్యు లో తెలిపాడు. టాలీవుడ్ టాప్ హిట్స్ అయిన “మగధీర-బాహుబలి” ఈ రెండు సినిమాల్లో బాహుబలి కంటే కూడా మగధీర అద్భుతమైన సినిమా అని పవన్ వ్యాఖ్యానించాడు. అయితే మరి ఆ సినిమా కన్నా బాహుబలికి కలెక్షన్స్ మరియు క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే…ఆ సినిమాను వేరే భాషల్లో సరిగా ప్రమోట్ చేయలేదని.. సరిగా రిలీజ్ చేయలేదని అందుకే ఆ సినిమాకు బాహుబలిని మించే సత్తా ఉన్నా…అక్కడే ఆగిపోయింది అంటూ తెలిపాడు.

ఇదే క్రమంలో సర్దార్ ను హిందిలో విడుదల చెయ్యాలి అన్న తన ఆలోచనపై సైతం పవన్ ఓపెన్ అయిపోయాడు… దీనిపై సమాధానం ఇస్తూ…తెలుగు వాళ్ళు అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు… అందుకే తమిళ సినిమాలకు మన దగ్గర గొప్ప మార్కెట్ ఉంది. కానీ మన సినిమాలు మాత్రం వేరే చోట పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందుకే మనం ఇక్కడ 40-50 కోట్లు పెట్టి తీసే సినిమాను తమిళంలో 50 లక్షలకు కూడా ఎవ్వరూ కొనరు. కానీ తమిళంలో 30 కోట్లు పెట్టి సినిమా తీస్తే మూడింట రెండొంతుల డబ్బులు తెలుగులోనే వచ్చేస్తాయి. అని చెబుతూనే మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి అని లేదంటే మనం ఇక్కడే ఉండిపోతాం అని పవన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా…పవన్ మరోసారి తన సొంత కుటుంభంపై ప్రేమను చాటుకున్నాడు అంటూ అక్కడక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus