ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్మ అజ్ఞాతంలో ఉండటం, పోలీసులు ఆయన కోసం గాలిస్తున్న సందర్భంలో పవన్ స్పందిస్తూ, ‘‘హోంశాఖ లేదా శాంతి భద్రతల అంశాలు నా పరిధిలో లేవు. పోలీసులను వారి పనిని వారినే చేయనివ్వండి. నేను నా పని చేస్తా’’ అన్నారు. అయితే ప్రత్యేకించి వర్మ కేసు విషయంలో పవన్ పెద్దగా స్పందించేందుకు ఇష్ట పడలేదు.
ముఖ్యమంత్రితో తనకు సంబంధమైన ప్రశ్నలను చర్చిస్తానని పవన్ పేర్కొన్నారు. ‘‘మీడియా నన్ను అడిగిన ప్రశ్నలను సీఎం దృష్టికి తీసుకెళ్లుతా. నేను ఏం మాట్లాడినా అది బాధ్యతతోనే ఉంటుంది’’ అని అన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, పారదర్శకత లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, వర్మపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై పలు వివాదాస్పద మార్ఫింగ్ ఫొటోలు, అభ్యంతరకర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇక విశాఖ, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. వర్మను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. వర్మ మాత్రం పోలీస్ లకు సపోర్ట్ చేయడం లేదని తెలుస్తోంది. వర్మ మాత్రం ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ పిటిషన్‌పై రేపటికి విచారణను వాయిదా వేసింది. దీంతో, వర్మ అప్పటివరకు అజ్ఞాతంలోనే ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది.
పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే, వర్మ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. కోయంబత్తూరులో షూటింగ్‌లో పాల్గొన్నట్లు, తన నటీనటులతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. పవన్ వ్యాఖ్యలతో వర్మ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇక హైకోర్టు తీర్పు తర్వాత వర్మ ఏమాత్రం స్వేచ్ఛగా వ్యవహరిస్తారో చూడాలి.