ఆగష్టు 9 న శుక్రవారం రోజు విడుదల చేసిన 66వ ‘జాతీయ చలనచిత్ర అవార్డుల’ లిస్ట్ లో పలు విభాగాల్లో తెలుగు సినిమాలకు 6 జాతీయ అవార్డులు లభించాయి. ఈ క్రమంలో కీర్తి సురేష్ కు ‘మహానటి’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. సావిత్రి గారి జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేసిందనే చెప్పాలి. 28 ఏళ్ళ తరువాత ఓ టాలీవుడ్ హీరోయిన్ ఇలా నేషనల్ అవార్డు దక్కించుకోవడం విశేషం. గతంలో ‘కర్తవ్యం’ చిత్రానికి గాను లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి నేషనల్ అవార్డు దక్కించుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి కీర్తి కి అవార్డు లభించింది.
దీంతో కీర్తి సురేష్ పై టాలీవుడ్ సెలెబ్రిటీలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరారు. ‘సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘మహానటి’ చిత్రంలో కీర్తి సురేష్ నటనకు అవార్డు రావడం అర్హమైనదే. జాతీయ అవార్డులు గెలుచుకున్న ఇతర చిత్రాలని కూడా పవన్ అభినందించారు. గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో కీర్తి సురేష్ తో కలిసి నటించారు పవన్ కళ్యాణ్.